జియో వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం

Written By:

టెలికం రంగంలో దిగ్గజాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జియో ప్రభుత్వానికి కూడా భారీగానే షాక్ ఇచ్చింది. జియో ఉచిత ఆఫర్ల దెబ్బకు కోట్ల నష్టాలను చవిచూసిన టెల్కోలతో పాటే ప్రభుత్వం కూడా కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులతో ప్రభుత్వం రూ .685 కోట్లను వదులుకోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ వెల్లడించింది.

స్టీవ్ జాబ్స్‌కి ఆపిల్ అందించిన గొప్ప కానుక..

జియో వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం

నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది. ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు, ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది.

BSNL కూడా కొత్త ఆఫర్‌తో వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత వాయిస్, డేటా ఆఫర్లు

సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. మార్చి 31 వరకు ఉచిత ఆఫర్లు ఉంటాయని అంబాని ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీగా రేట్లు తగ్గిస్తూ..

దీంతో అప్పటినుంచి ఇతర టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వాటి రెవెన్యూలకు భారీగా గండిపడింది.

ప్రభుత్వానికి కూడా నష్టాలు

కంపెనీల రెవెన్యూలను ఆధారంగానే ప్రభుత్వం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెవెన్యూలు పడిపోతుండటంతో ప్రభుత్వానికి కూడా నష్టాలు పెరిగిపోతున్నాయి.

మరో 8-10 శాతం క్షీణించే అవకాశం

టెలికాం కంపెనీల రెవెన్యూలు మరో 8-10 శాతం క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టెలికం కమిషన్, 2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను ట్రాయ్ కచ్చితంగా అప్లయ్ చేయాలని ఆదేశించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి కమిషన్ సూచించింది.

ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు

ట్రాయ్ 2002 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. కానీ జియో తన ఉచిత ఆఫర్లను వివిధ పేర్లతో పొడిగిస్తూ వస్తోంది. ఈ విషయంపై టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా లీగల్‌గా సవాల్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Jio’s free call and data plans have cost the government Rs 685 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot