స్టీవ్ జాబ్స్‌కి ఆపిల్ అందించిన గొప్ప కానుక..

Written By:

ఆపిల్ సంస్థ మరో రెండు నెలల్లో కొత్త కార్యాలయంలోకి షిఫ్ట్ అవబోతోంది. 175 ఎకరాల వైశాల్యంలో ఓ పెద్ద రింగు మాదిరిగా 2.8 మిలియన్‌ చదరపు అడుగుల వెడల్పులో నిర్మించిన ప్రధాన కార్యాలయంలో తన కార్యాకలపాలను సాగించనుంది. అదే రోజు ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ పేరిట నిర్మించిన ప్రత్యేక థియేటర్‌ను కూడా ప్రారంభించి ఆయన జయంతి కానుకగా అందించనుంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో ఆపిల్‌ సంస్థ ఒక వార్తా ప్రకటనను విడుదల చేసింది.

6జిబి ర్యామ్‌తో 28న దూసుకొస్తున్న హానర్ వీ9

స్టీవ్ జాబ్స్‌కి ఆపిల్ అందించిన గొప్ప కానుక..

ప్రస్తుతం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న పాత కార్యాలయం నుంచి దాదాపు 12,000మందిని తరలించనుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ నెల నుంచి ప్రారంభించి మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయనుంది. ఇందులో తమ సంస్థకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి క్యాన్సర్‌ కారణంగా కన్నుమూసిన స్టీవ్‌ జాబ్స్‌ పేరిట దాదాపు వెయ్యిమంది కూర్చునే సామర్థ్యం ఉన్న పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించింది.

అన్ని ఫీచర్లున్న ఫోన్ రూ. 5,499కే !

దీనికే స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియం అని నామకరణం చేసింది. 2011లో క్యాన్సర్‌ కారణంగా స్టీవ్‌ జాబ్స్‌ కన్నుమూశారు. ఆపిల్ కొత్త బిల్డింగ్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం చాలానే ఉంది. దీనికోసం ఆయన చాలానే కష్టపడ్డారు. 2009లో ఆయన నడుం బిగించారు. 2013లో కుపెర్టినో ప్లానింగ్ కమిషన్ ఈ ప్లాన్ ను ఎలా బయటకు తెస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే దానికి స్టీవ్ జాబ్స్ మీరు దాని గురించి ఆలోచించకండి ఎలా భాగస్వాములు కావాలో ఆలోచించడం అని చెప్పారు.

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్ ను ఇనస్పిరేషన్ గా తీసుకుని చేయడం జరిగింది. రింగ్ ఆకారంలో ఈ బిల్డింగ్ ను రెడీ చేస్తున్నారు. 2014లో కుపెర్టినో ప్లానింగ్ కమిషనర్ ఫాస్టర్ ఇది ఆర్కిటెక్ లోనే ఓ గొప్ప రికార్డు అంటూ పొగిడారు. పార్క్ అంతా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పార్క్ ను పోలి ఉంటుంది.

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు ఉండేందుకు వీలుగా ఉంటుంది. ఫ్లోర్ స్పేస్ దాదాపు 2. 8 మిలియన్ల చదరపు అడుగుల ఉంటుంది.మీటింగ్ కోసమే 80 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు

ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు ప్రపంచంలోనే ఏ కంపెనీకి వాడనటువంటివి. కర్వ్ గ్లాసెస్ ను వాడారు. అలాగే 10 వేల మంది కూర్చునే విధంగా అండర్ గ్రౌండ్ లో ఆడిటోరియం ఉంటుంది.ఇందుకోసం లక్షా 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

 

 

దాదాపు 80 శాతం పచ్చదనం

క్యాంపస్ పూర్తి అయితే దాదాపు 80 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది.ఈ క్యాంపస్ లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆపిల్ చెట్లు సైతం కనువిందు చేస్తాయి, అలాగే నేరేడు చెట్లతో క్యాంపస్ నిండిపోయి ఉంటుంది. అది ఆఫీస్ కాదు ప్లాంటేషన్ అంటేఎవరైనా ఇట్టే నమ్మేస్తారు.

సోలార్ పవర్ మీదనే

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే నడుస్తుంది. ఇందుకోసం దాదాపు 70 వేల చదరపు అడుగుల్లో సోలార్ ప్యానల్స్ ను నిర్మించారు. ఈ బిల్డింగ్ లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే దీన్ని పూర్తిగా ప్రకృతి సిద్ధంగా నిర్మించారు. ఇందులో గాలి కూడా కేవలం వెంటిలేషన్ సాయంతోనే నడుస్తుంది.అయితే ఇందులో మరో కోణం కూడా దాగి ఉంది మొత్తం గ్రీన్ తో నింపేయాలని ప్లాన్ లో భాగమని తెలుస్తోంది.

పనికిరాని వాటర్ ని తిరిగి రీ సైక్లింగ్

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని తిరిగి రీ సైక్లింగ్ చేసి క్యాంపస్ లోనే చెట్లకే వాడుతారు. ఇందులో రోజుకు లక్షా 57 వేల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీళ్లను వృధాగా పోనీయకుండా తిరిగి మెక్కలకే వాడే విధంగా ప్లాన్ చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This is Apple's gift to Steve Jobs on his birth anniversary read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot