Motorola One Fusion+ స్మార్ట్‌ఫోన్ లాంచ్ మరో మూడు రోజులలోనే...

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రోజు రోజుకి తన వాటాను పెంచుకుంటున్న మోటరోలా సంస్థ ఇప్పుడు మరొక మిడ్ రేంజ్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నది. మోటరోలా వన్ ఫ్యూజన్ + పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను జూన్ 16న లాంచ్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ముందు భాగంలో పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌తో రాబోతున్న ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో విడుదల అవుతున్నట్లు సమాచారం.

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ లాంచ్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ లాంచ్

లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ సంస్థ మోటరోలా చేసిన ట్వీట్ ద్వారా కంపెనీ ఈ అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఇండియాలో 'మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేస్తున్నాము' అని తన ట్వీట్ ద్వారా సంస్థ తెలిపింది. జూన్ 16న లాంచ్ చేయబోయే మోటరోలా ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Motorola Moto G8 Power Lite Sale:గొప్ప ఆఫర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్!!!

ఫ్లిప్‌కార్ట్ - మోటరోలా వన్ ఫ్యూజన్ +‌ టీజర్

ఫ్లిప్‌కార్ట్ - మోటరోలా వన్ ఫ్యూజన్ +‌ టీజర్

ఫ్లిప్‌కార్ట్‌లోని మోటరోలా వన్ ఫ్యూజన్ + టీజర్ పేజీ జూన్ 16 న ఈ ఫోన్ లాంచ్ అవుతున్నట్లు వెల్లడించింది. లాంచ్ డేట్‌తో పాటు దీని యొక్క లభ్యతను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ధృవీకరించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇది ట్విలైట్ బ్లూ మరియు మూన్‌లైట్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదల అవుతున్నట్లు టీజర్ పేజీ సూచిస్తుంది. Also Read:Mi NoteBook 14 Series ల్యాప్‌టాప్‌లతో దూసుకొస్తున్న షియోమి!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

ఇండియాలో మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క ధరల విషయానికి వస్తే ఇది కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల కానున్నది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ గల దీని ధర సుమారు రూ. 25,400.

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC చేత శక్తిని పొందుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్ - HD + డిస్ప్లేని 1,080x2,340 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ డ్యూయల్ సిం స్లాట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతు ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కెమెరా సెటప్

మోటరోలా వన్ ఫ్యూజన్ + కెమెరా సెటప్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో సరళ రేఖలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో గల పాప్-అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ +  కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11 ac, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ మరియు డ్యూయల్ 4G VoLTE సిం స్లాట్ ఉన్నాయి. అలాగే ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Motorola One Fusion+ Launch Date Fixed in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X