రూ. 2470 కోట్లను ఆఫర్ చేసిన నోకియా

Written By:

ఫీచర్ ఫోన్ల హవా ఉన్నంత కాలం మొబైల్ మార్కెట్‌ను శాసించిన నోకియా.. స్మార్ట్ ఫోన్ల విషయంలో మాత్రం వెనకబడిపోయింది. చివరకు మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసి బ్రాండ్ నేమ్ మార్చినా నోకియాకు ఊపు రాలేదు. ఇప్పుడు నోకియా మరోసారి సొంతగానే అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

20 కోట్ల మంది యూజ్ చేస్తున్న యాప్

రూ. 2470 కోట్లను ఆఫర్ చేసిన నోకియా

నోకియా 6తో మొబైల్ మార్కెట్లో తొలిసారిగా సత్తా చాటిన నోకియా కంపెనీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మొబైల్ మార్కెట్‌లో స్థిరపడాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీల కొనుగోలుపై నోకియా దృష్టి పెట్టింది. నెట్‌వర్క్‌ పరికరాలను తయారు చేసే కాంప్‌టెల్‌ అనే కంపెనీని కొనుగోలు చేసేందుకు రూ.2,470 కోట్లను ఆఫర్‌ చేసింది నోకియా.

నోకియా నుంచి మరో సంచలనం,రికార్డుల మోతేనా..

రూ. 2470 కోట్లను ఆఫర్ చేసిన నోకియా

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఈ కాంప్‌టెల్‌‌ను కొనుగోలు చేయడం ద్వారా.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో విస్తరించాలన్నది నోకియా ఆలోచనగా తెలుస్తోంది. కాంప్‌టెల్‌ సంస్థకు చెందిన ఒక్కో షేర్‌కు 3.04 యూరోల నగదును ఆఫర్‌ చేస్తోంది నోకియా. ఇది కాంప్‌టెల్‌ షేర్ గత ముగింపు కంటే 29శాతం అదనం కావడం విశేషం.

English summary
Nokia Offers to Buy Telecom Software Firm Comptel for 370 Million dollers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot