వస్తూనే బంపరాఫర్లను ప్రకటించిన పేటీఎం

Written By:

2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన పేటీఎం వస్తూనే బంపరాఫర్లను ప్రకటించింది. తమ వద్ద ఖాతా ప్రారంభించేందుకు కనీస బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదని చెప్పింది. ఖాతాల్లోని నగదుపై 4 శాతం వడ్డీని ఇస్తామని, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఉంటుందని, ఆన్ లైన్ లావాదేవీలపై ఎటువంటి రుసుమునూ వసూలు చేయబోమని తెలిపింది.

జియో కథ కంచికి..? సర్వే చెప్పిన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 400 కోట్ల పెట్టుబడితో

చైనా దిగ్గజం అలీబాబా, జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ వెన్నంటి ఉండగా, ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడితో పేటీఎం తన సేవలను ప్రారంభించింది.

మూడో సంస్థ పేటీఎం

ఇప్పటికే ఎయిర్ టెల్, ఇండియా పోస్ట్ సంస్థలు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించగా, ఈ తరహా ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన మూడో సంస్థ పేటీఎం.

తొలి శాఖను ఢిల్లీలో

గత బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈ సేవలను ప్రారంభించింది పేటీఎం సంస్థ. తొలి శాఖను ఢిల్లీలో ప్రారంభించింది.

రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తే వారికి రూ.250 క్యాష్‌బ్యాక్‌

డిపాజిట్లపై క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని కూడా అందిస్తోంది పేటీఎం. ఖాతాదారు పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాను తెరిచి.. అందులో రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తే.. వారికి రూ. 250 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ తదితర ఆన్ లైన్ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చని అన్నారు.

వడ్డీరేటు 4శాతం

సేవింగ్‌ ఖాతాల వారికి వార్షిక వడ్డీరేటు 4శాతంగా ప్రకటించింది. అంతేగాక, పేటీఎం బ్యాంకు సేవింగ్‌ ఖాతాలో కనీస నగదు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి నగదు లేకుండానే ఖాతాను తెరుచుకోవచ్చు.

తొలి సంవత్సరంలో 31 శాఖలను

తొలి సంవత్సరంలో 31 శాఖలను 3 వేల కస్టమర్ సర్వీస్ పాయింట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు శేఖర్ శర్మ తెలిపారు. 2020 నాటికి 500 మిలియన్ల కస్టమర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శేఖర్‌ శర్మ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Payments Bank Launched: Here's What It Means for You Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot