4G డౌన్‌లోడ్ వేగంలో అగ్రస్థానంలో రిలయన్స్ జియో

|

రిలయన్స్ జియో మరోసారి సగటు 4G డౌన్‌లోడ్ వేగంతో తన ప్రత్యర్థులను ఓడించగలిగింది. TRAI ప్రకారం రిలయన్స్ జియో సంస్థ ఆగస్టు నెలలో సగటున 21.3Mbps డౌన్‌లోడ్ వేగాన్ని సాధించింది. జూలైలో కంపెనీ నమోదు చేసిన 21.0Mbps నుండి 0.3Mbps వేగంతో మెరుగుదల పొందింది. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎనిమిది నెలల్లో జియో 4G డౌన్‌లోడ్ వేగంను అందించే ఆపరేటర్‌గా అగ్రస్థానంలో ఉంది. ఎయిర్టెల్ రెండవ స్థానంలో ఉంది. కానీ దాని సగటు డౌన్‌లోడ్ వేగం ఆగస్టు నెలలో తగ్గింది.

TRAI

TRAI ప్రకారం ఎయిర్టెల్ సగటున 4G డౌన్‌లోడ్ వేగం 8.2Mbps. జూలైలో దీని యొక్క డౌన్‌లోడ్ వేగం 8.8Mbps అంటే ఈ నెలలో దీని యొక్క వేగం 0.6Mbps వేగం తగ్గింది. వొడాఫోన్ యొక్క సగటు 4G డౌన్‌లోడ్ వేగం 7.7 ఎమ్‌బిపిఎస్ వద్ద ఉండగా ఐడియా యొక్క సగటు వేగం గత నెలతో పోల్చితే 6.6 ఎమ్‌బిపిఎస్ నుంచి 6.1 ఎమ్‌బిపిఎస్‌కు తగ్గింది. ఆగస్టులో జియో సగటు అప్‌లోడ్ వేగం 4.4Mbps గా నమోదైంది. ఇది జూలై నుండి మెరుగుదల. వోడాఫోన్ ఆగస్టులో సగటున 5.5Mbps వేగంతో అప్‌లోడ్ చేసింది. ఎయిర్టెల్ మరియు ఐడియా సెల్యులార్ రెండూ వారి సగటు 4G అప్‌లోడ్ వేగం స్వల్పంగా క్షీణించాయి.

ఎయిర్‌టెల్

ఐడియా సగటున 4G అప్‌లోడ్ వేగం 5.1 ఎమ్‌బిపిఎస్ కాగా, ఎయిర్‌టెల్ యొక్క 4G అప్‌లోడ్ వేగం ఆగస్టులో 3.1 ఎమ్‌బిపిఎస్. ఆగస్టు నెలలో సగటు వేగం డౌన్‌లోడ్‌లో జియో ఆధిక్యంలో ఉందని మరియు అప్‌లోడ్ వేగంలో వొడాఫోన్ అగ్రస్థానంలో ఉందని ట్రాయ్ నివేదించింది.

TRAI

రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ యాప్ ను ఉపయోగించి సేకరించే డేటా వేగం ఆధారంగా సగటు వేగాన్ని TRAI లెక్కిస్తుంది. గుర్తుచేసుకుంటే రిలయన్స్ జియో 2018 లో 4G సర్వీసు ప్రొవైడర్ గా అవతరించింది. గత ఏడాది మొత్తం పన్నెండు నెలల్లో అత్యధిక సగటు డౌన్‌లోడ్ వేగాన్ని అందించిన ఆపరేటర్ గా కూడా ఘనత సాధించింది.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో ప్రస్తుతం 340 మిలియన్లకు పైగా చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. ప్రస్తుత ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ యొక్క ప్రత్యర్థుల యూజర్‌బేస్ క్షీణత కారణంగా దాని యొక్క వృద్ధి పెరిగింది. మొబైల్ వైర్‌లెస్ సర్వీస్ విజయవంతం కావడంతో జియో ఇప్పుడు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ గా కూడా విస్తరించింది.

Best Mobiles in India

English summary
Reliance Jio Listed in Top for 4G download speed test

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X