జియో టీవీతో పోటీకు సిద్దమైన టాటా స్కై మొబైల్ యాప్

|

ఇండియాలో కంటెంట్‌ను అందించే మొబైల్ యాప్ లు ఇప్పుడు ఎక్కువ అయినాయి. కంటెంట్‌తో కూడిన మొబైల్ యాప్ లను అందించే దానిలో జియో టీవీ,వోడాఫోన్,ఎయిర్టెల్ వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలోకి టాటా స్కై మొబైల్ యాప్ కూడా చేరింది. టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా సుమారు 400 టీవీ ఛానెల్‌లను లైవ్ గా చూడగలిగే సదుపాయాన్ని కల్పిస్తోంది.

టాటా స్కై యాప్
 

ఇండియాలో కంటెంట్‌ను వినియోగించే సరికొత్త మరియు ప్రసిద్ధ మార్గం ప్రకటనలు లేకుండా ప్రసారం చేసే JioTV మరియు టాటా స్కై యాప్ వంటి OTT యాప్ లు. ఈ యాప్ లు వినియోగదారులు ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. ఇవి టీవిలో అందించే కంటెంట్‌ను అందిస్తాయి. నిర్ణీత సమయంలో టీవీలోని కంటెంట్ చూడటానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

జియో టీవీ

ప్రస్తుతం ఛానెల్‌లను అందించడంలో అతిపెద్దది జియో టీవీ యాప్. ఇది టీవీ సెట్ అవసరం లేకుండా చిన్న స్క్రీన్లలో లైవ్ గా టీవీ ఛానెళ్లను అందిస్తుంది. DTH సర్వీసు ప్రొవైడర్లకు ఇది నష్టమే అయినప్పటికీ వారు OTT ప్రత్యామ్నాయాలను అందించడం ద్వారా చేస్తున్నారు.టాటా స్కై వినియోగదారులకు లైవ్ టివి ఛానెళ్లను అందించటానికి ఇప్పుడు దాని స్వంత యాప్ ఉంది. ఇది జియో యొక్క లైవ్ టివికి ప్రత్యక్ష పోటీగా ఉంది. ఇండియాలో OTT యాప్ ద్వారా జియో టీవీ అత్యధిక సంఖ్యలో ఛానెల్‌లను అందస్తు ఉండగా టాటా స్కై కూడా దానికి గట్టి పోటీగా ఎక్కువ ఛానెల్‌లను అందిస్తోంది. జియో టివి తన చందాదారులకు 647 లైవ్ టివి ఛానెళ్లను అందిస్తుండగా టాటా స్కై కూడా తన వినియోగదారులకు 400 కన్నా ఎక్కువ ఛానెల్‌లను అందిస్తోంది.

టాటా స్కై మొబైల్ యాప్ ఉపయోగించి ఛానెల్‌లను ఎలా ఎంచుకోవాలి
 

టాటా స్కై మొబైల్ యాప్ ఉపయోగించి ఛానెల్‌లను ఎలా ఎంచుకోవాలి

స్టెప్ 1

టాటా స్కై మొబైల్ యాప్ ను ప్రారంభించడానికి మొదటగా మీ యొక్క మొబైల్ ఫోన్ లో టాటా స్కై మొబైల్ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. తరువాత మీ యొక్క ఆధారాలతో లాగిన్ అవ్వండి. మొదటిసారి చేస్తే మీ యొక్క మొబైల్ నంబర్ లేదా చందాదారుల ID ను ఉపయోగించి లాగిన్ IDను సృష్టించుకోవాలి. తరువాత కొత్తగా మీ యొక్క పాస్‌వర్డ్‌ను సృష్టించాలి. ఒక వేల మీకు ముందే లాగిన్ ID ఉంటే కనుక ID తో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2

స్టెప్ 2

లాగిన్ IDతో లాగిన్ అయిన తరువాత హోమ్ స్క్రీన్‌లో మీరు ఫీచర్ షోలు, లైవ్ టీవీ ఛానెల్ జాబితా వంటివి మరిన్ని కనిపిస్తాయి. కుడివైపున ఎగువ భాగంలో మీకు హాంబర్గర్ మెను బటన్‌ కనిపిస్తుంది దానిపై నొక్కండి. ఇక్కడ మీరు మీ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ వంటివి చూడవచ్చు. అందులో వున్న "మై టాటా స్కై" మీద నొక్కండి.

స్టెప్ 3

స్టెప్ 3

ఇక్కడ ఇతర పేజీకి మళ్ళించబడే "మ్యానేజ్ ప్యాక్‌ల" పై నొక్కండి. తరువాత "గో టు మోడీఫ్య్ ప్యాక్స్"( "ప్యాక్‌లను సవరించడానికి వెళ్ళు ") పై నొక్కండి. దానిని నొక్కిన తరువాత మీరు మీ అకౌంట్ యొక్క పూర్తి సారాంశాన్ని చూడవచ్చు.

స్టెప్ 4

స్టెప్ 4

"ప్యాక్‌ని సవరించు" పై నొక్కండి. మీరు ప్రస్తుత ప్యాక్‌లు, టాటా స్కై క్యూరేటెడ్ ప్యాక్‌లు, బ్రాడ్‌కాస్టర్ ప్యాక్‌లు, ఛానెల్‌లు మరియు మరిన్ని చూస్తారు. సవరించడానికి "+" బటన్‌ను నొక్కండి మరియు మీకు కావలసిన ఛానెల్ లేదా ప్యాక్ యొక్క "చెక్‌బాక్స్" పై నొక్కండి.

స్టెప్ 5

స్టెప్ 5

మీరు ప్యాక్‌లను ఎంచుకోవడం పూర్తయిన తర్వాత దిగువన ఉన్న "ఎంచుకోండి & కొనసాగండి" నొక్కండి. ఇది మీరు జోడించిన ఛానెల్ ప్యాక్‌ల యొక్క ధరలు మరియు మరిన్ని విషయాలను మొత్తాన్ని చూపుతుంది. అన్నీ మంచిగా అనిపిస్తే "కంఫార్మ్" పై నొక్కండి.

ఛానెల్‌లను తొలగించడం

ఛానెల్‌లను తొలగించడం

పైన ఉపయోగించిన పద్దతుల ద్వారా టాటా స్కై మొబైల్ యాప్ ఉపయోగించి ఛానెల్‌లను తొలగించవచ్చు మరియు ఛానెల్ యొక్క ప్యాక్‌లను కూడా మార్చుకోవచ్చు మరియు సవరించవచ్చు. ఛానెల్‌లను తొలగించడానికి పైన ఉపయోగించిన అన్ని పద్దతులను పాటించి స్టెప్ 4లో "+" బటన్‌కు బదులుగా "-" బటన్‌ను నొక్కండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky mobile app: Offers 400 live TV channels

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X