సిమ్‌కార్డు వాడే వారికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Written By:

మొబైల్ నంబర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక సంవత్సరంలోపు దేశంలోని ప్రతీ మొబైల్ యూజర్ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సిమ్ కార్డ్ వాడుతున్న ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించాలని కోర్టు తెలిపింది.

ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

సిమ్‌కార్డు వాడే వారికి సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇండియాలో దాదాపు 100 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారని, వారందరికి ఆధార్ కార్డ్‌ను తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్న కస్టమర్లకు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు అందాయి. ఇక నుంచి ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే ప్రతీ ఒక్కరూ ఆధార్ కార్డుకు సంబంధించిన ధరఖాస్తును పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. సిమ్ కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫేస్‌బుక్‌లో లైకులు కొడుతున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిమ్ పుల్ ఫార్మ్

సిమ్ పుల్ ఫార్మ్ ఏంటో చాలామందికి తెలియదు. సిమ్ అంటే సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ఓ ఇంటిగ్రేటెడ్ చిప్.

అంతర్జాతీయ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ నంబర్

ఈ సిమ్‌లో అంతర్జాతీయ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ నంబర్ అలాగే దానికి సంబంధించిన నంబర్ పొందుపరిచి ఉంటారు.

వివిధ కెపాసిటీలో

సిమ్ కార్డు వివిధ కెపాసిటీలో లభిస్తుంది. మీరు కాంటాక్ట్స్ సేవ్ చేసే సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు సిమ్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ సామర్ధ్యం ఉన్న సిమ్ ట్రైచేయండి.

రెండు పాస్వర్డ్ లు

SIM లో రెండు పాస్వర్డ్ లు ఉంటాయి,ఒకటి 'PIN' ఇది సాధారంగా SIM ని లాక్ చేయడానికి ఉపయోగిస్తాము,ఇంకోటి PUK సిమ్ లాక్ చేసాక ఆ పిన్ మర్చిపోతే ఈ PUK ఉపయోగించి దాన్ని ఓపెన్ చేస్తారు.

రకరకాల సిమ్‌లు

కాలం మారే కొద్ది రకరకాల సిమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడున్న సిమ్‌ల్లో రెగ్యులర్ సిమ్, మినీ సిమ్, మైక్రో సిమ్, నానో సిమ్ లు ముఖ్యమైనవి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
SC to Centre: Register ID details of all mobile subscribers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot