ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియాకి మరో మొబైల్ దిగ్గజం జై కొట్టింది. ఆపిల్ బాటలోనే ఇండియాలో స్మార్ట్‌ఫోన్లు తయారు చేయనున్నట్టు కెనడాకి చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్లాక్‌బెర్రీ ప్రకటించింది. ఇందుకు వీలుగా భారత కంపెనీ ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది.

5జీ కన్నా 10 రెట్లు వేగంతో టెరాహెర్జ్ వస్తోంది

ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

భారత్ సహా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లలో స్థానికంగా ఫోన్లు తయారు చేసేందుకు ఆప్టిమస్‌తో బ్లాక్‌బెర్రీ ఒప్పందం చేసుకుంది. డీటీఈకే50, డీటీఈకే60 హ్యాండ్‌సెట్ల పంపిణీ, అమ్మకాల కోసం గతేడాది నవంబర్లో బ్లాక్‌బెర్రీ, ఆప్టిమస్ కంపెనీలు జతకట్టాయి. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ఈ డివైజ్‌ల అమ్మకాలు ఎప్పటిమాదిరిగానే కొనసాగుతాయి.

పాత ఫోన్ ఇవ్వండి, 18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం చేసుకోండి

ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

తాజాగా కుదుర్చుకున్న ప్రాంతీయ ఒప్పందం ప్రకారం ఆప్టిమస్ కంపెనీ బ్లాక్ బెర్రీ బ్రాండ్ మొబైల్ ఫోన్ల డిజైన్, తయారీ, అమ్మకాలతో పాటు ప్రచార బాధ్యతలు, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను కూడా నిర్వహించనుంది. పూర్తి బ్లాక్‌బెర్రీ అనుభూతిని కలిగించడంతో పాటు బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే బాధ్యలను కూడా ఆప్టిమస్ చూస్తుంది.

4జీ ర్యామ్‌తో అదరగొడుతున్న మోటో ఫోన్లు..

ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మేకిన్ ఇండియా'కి కూడా మద్దతు ఇస్తున్నట్టు ఇరు కంపెనీలు తమ ఒప్పందంలో పేర్కొన్నాయి.

English summary
BlackBerry Partners Optiemus to Manufacture, Sell Smartphones in India in New Licensing Agreement read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot