టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మంచి శుభవార్త

|

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు చాలా మంచి శుభవార్త అందిస్తోంది. అది ఏమిటంటే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు తమ ప్లాన్ ను తొమ్మిది నెలల దీర్ఘకాలిక ప్రణాళికను ఎంచుకుంటే అదనంగా మరొక ఆరు నెలల పాటు దీని యొక్క ఉచిత సర్వీస్ కు అర్హులు అవుతారు. అలాగే ఈ ఆఫర్ కింద టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ 12 నెలల పాటు గల ఒక ప్రణాళికను ఎంచుకుంటే కనుక సంస్థ అదనంగా మరొక ఆరు నెలల పాటు తమ సేవలను ఉచితంగా కస్టమర్లకు అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మంచి శుభవార్త

 

ఈ మొత్తం ప్రయోజనాన్ని 18 నెలల కాలం పాటు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం అందిస్తోంది. టాటా స్కై సంస్థ ప్రస్తుతం అందిస్తున్న అన్‌లిమిటెడ్ మరియు ఫిక్స్‌డ్ జిబి ప్లాన్‌లలో ఇది అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుతం 21 నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మంచి శుభవార్త

ఈ నగరాలలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎటువంటి FUP పరిమితి లేకుండా 100 Mbps వేగంతో పంపిణీ చేస్తోంది. కొత్తగా మార్కెట్ లో జియోఫైబర్ వాణిజ్య ప్రయోగంతో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ నుండి వస్తున్న ఈ అదనపు చెల్లుబాటు ఆఫర్ తప్పనిసరిగా చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అదనపు చెల్లుబాటు ఆఫర్:

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అదనపు చెల్లుబాటు ఆఫర్:

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అన్ని నగరాల్లోని వినియోగదారులకు అన్‌లిమిటెడ్ మరియు ఫిక్స్‌డ్ జిబి డేటా ప్లాన్‌లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ డేటా కేటగిరీలో భాగంగా కంపెనీ మొత్తం ఐదు ప్లాన్‌లు రూ.590, రూ.700, రూ.800, రూ.1,100 మరియు 1,300 రూపాయలతో అందిస్తున్నాయి. వీటి యొక్క డేటా స్పీడ్ వరుసగా 16 Mbps, 25 Mbps , 50 Mbps , 75 Mbps మరియు100 Mbps . టాటా స్కై అందిస్తున్న100Mbps అన్‌లిమిటెడ్ డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర నెలకు 1,300 రూపాయలు. అలాగే ఈ ప్లాన్ యొక్క ఖరీదు తొమ్మిది నెలలకు కలిపి11,700 రూపాయలు. ఒక కస్టమర్ తొమ్మిది నెలల పాటు ఈ ప్లాన్ ను కనుక ఎంచుకుంటే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అదనంగా నాలుగు నెలల పాటు తమ సేవలను ఉచితంగా క్రెడిట్ చేస్తుంది. అంటే కస్టమర్ 100 Mbps డేటా వేగాన్ని 13 నెలల పాటు ఎటువంటి FUP పరిమితి లేకుండా కేవలం 11,700 రూపాయలతో ఆస్వాదించవచ్చు. కాబట్టి నెలకు 100 Mbps కనెక్షన్ కోసం ప్రభావవంతమైన ధర కేవలం 900 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.

అహ్మదాబాద్ నగరంలో:
 

అహ్మదాబాద్ నగరంలో:

పైన పేర్కొన్న అన్ని అపరిమిత డేటా ప్రణాళికలకు ఇదే తరహా వర్తిస్తుంది. ఒక కస్టమర్ మూడు నెలల ముందస్తు కోసం పైన పేర్కొన్న ఏదైనా ప్రణాళికలను ఎంచుకుంటే టాటా స్కై అదనంగా ఒక నెల పాటు తమ సేవలను ఉచితంగా అందిస్తుంది. పైన పేర్కొన్న ఆఫర్ అహ్మదాబాద్ నగరంలోని టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలకు వర్తిస్తుంది.

హైదరాబాద్ నగరంలో:

హైదరాబాద్ నగరంలో:

హైదరాబాద్ నగరంలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వేరే ఆఫర్‌ను నడుపుతోంది ఇది వినియోగదారునకు ఆరు నెలల వరకు అదనపు సేవలను అందిస్తుంది. హైదరాబాద్‌లోని టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు 16,788 రూపాయలు చెల్లించి 12 నెలల పాటు 100 Mbps అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను ఎంచుకుంటే ఆ సంస్థ మొత్తం మీద మరొక ఆరు నెలల పాటు తమ సేవలను ఉచితంగా అందిస్తుంది. అంటే వినియోగదారులు మొత్తం ప్రయోజనాన్ని 18 నెలలకు ఆస్వాదించవచ్చు. ఇటువంటి ఆఫర్ దాదాపు ప్రతి నగరంలోను కాస్త విభిన్నంగా ఉందని గమనించండి. కాబట్టి ఆఫర్‌ను ఎంచుకునే ముందు టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌తో తనిఖీ చేయండి.

 బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాలు :

బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాలు :

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కొంతకాలంగా వార్తల్లో ఉంది. అయితే రిలయన్స్ జియోఫైబర్ మార్కెట్ లో లాంచ్ కావడంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి కంపెనీ కొత్త కొత్త ఆఫర్‌లతో మరియు కొత్త నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే, కోల్‌కతా వంటి వాటితో కలిపి మొత్తం మీద 21 నగరాల్లో తమ సేవలను అందిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో అపరిమిత FUP ప్రణాళికలను అందించడం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుని ఆకర్షించడానికి ఉత్తమ మార్గం అని టాటా స్కై తమ ప్రణాళికలలో కొత్త మార్పులను చేసింది. అపరిమిత డేటా ప్లాన్‌లు అవసరం లేనివారి కోసం కూడా కంపెనీ కొన్ని స్థిర జిబి ప్లాన్‌లను అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Broadband Long Term Plans Extend the Service Up to 6 Months for Free

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X