తగ్గింపు ఆఫర్‌లతో టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లు

|

డిటిహెచ్ ఆపరేటర్ పరిశ్రమలో ప్రతి ఆపరేటర్ తమ పంథాలో ఆఫర్లను అందిస్తున్నాయి. కస్టమర్‌కు ప్రత్యేకమైన సేవలను అందించే విషయానికి వస్తే టాటా స్కైకి పోటీగా ఏ డిటిహెచ్ ఆపరేటర్ దగ్గరలో లేదు. టాటా స్కైలో ఇప్పటికే తాత్కాలిక అకౌంట్ సస్పెన్షన్, టాటా స్కై వాచ్ వంటి కొన్ని ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి.

ట్-టాప్ బాక్స్‌
 

హార్డ్‌వేర్ విభాగంలో టాటా స్కై వినియోగదారులకు ఆఫర్‌లో భాగంగా మొత్తం నాలుగు సెట్-టాప్ బాక్స్‌లను సరసమైన ధరకు అందిస్తున్నందున డిటిహెచ్ విభాగంలో అందరి కంటే చార్టులో ముందుంది. టాటా స్కై ప్రస్తుతం స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డి), హై డెఫినిషన్ (హెచ్‌డి), + హై డెఫినిషన్ (+ హెచ్‌డి) మరియు అల్ట్రా హై డెఫినిషన్ 4 కె సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తోంది.

దరల వివరాలు

దరల వివరాలు

ధరల విషయానికి వస్తే టాటా స్కై SD సెట్-టాప్ బాక్స్ కేవలం రూ.1,399లకు, HD బాక్స్ ప్రస్తుతం రూ.1,499లకు, + హెచ్‌డీ రూ.9,300 మరియు అల్ట్రా హెచ్‌డి 4 కె సెట్‌-టాప్ బాక్స్‌ రూ .6,400 వద్ద లభిస్తాయి. టాటా స్కై అందించే ఈ సెట్-టాప్ బాక్స్‌లు అందించే ఫీచర్లు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫీచర్స్

ఫీచర్స్

డిస్ప్లే

టాటా స్కై ఎస్డీ సెట్-టాప్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా డిస్ప్లేలో చాలా తక్కువ ఆఫర్ ఉంటుంది మరియు STB యాక్సిస్ ను మాత్రమే అందిస్తుంది. టాటా స్కై హెచ్‌డి ఎస్‌టిబి అయితే 1080p రిజల్యూషన్, 3G కంపాటిబిలిటీ మరియు 16: 9 కారక నిష్పత్తితో అందిస్తుంది. టాటా స్కై HD + బాక్స్ కూడా అదే ఫీచర్లను అందిస్తుంది. టాటా స్కై 4 కె బాక్స్ పైన పేర్కొన్న అన్ని లక్షణాలతో వస్తుంది.

సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన BSNL

ఆడియో
 

ఆడియో

ఆడియో లేదా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే తక్కువ స్థాయిలో ఉన్న టాటా స్కై SD STB PCM ఆధారిత ఆడియోను మాత్రమే అందిస్తుంది. కానీ టాటా స్కై హెచ్డి మరియు హెచ్డి + సెట్-టాప్ బాక్స్ లు డాల్బీ డిజిటల్ సరౌండ్ మరియు డాల్బీ ఆడియోను మరియు డిజిటల్ ప్లస్ సరౌండ్ మద్దతు కూడా అందిస్తుంది. టాటా స్కై 4 కె PCM, డాల్బీ డిజిటల్ సరౌండ్ మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ సరౌండ్లను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు

అదనపు ఫీచర్స్

అదనపు ఫీచర్స్

టాటా స్కై తన వినియోగదారులకు అందించే ఇతర అదనపు ఫీచర్స్ లలో ఒకటి వీడియో-ఆన్-డిమాండ్. అయితే ఇది టాటా స్కై HD + వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. సెట్-టాప్ బాక్స్ యొక్క HD వేరియంట్,4K వేరియంట్ 500GB హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్ నుండి రికార్డ్ చేసే ఎంపిక, రివైండ్, ఫార్వర్డ్ ,పాజ్ మరియు సిరీస్ రికార్డింగ్ తో వస్తుంది.

ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు అందిస్తున్న సెట్-టాప్ బాక్స్ లు

ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు అందిస్తున్న సెట్-టాప్ బాక్స్ లు

సెట్-టాప్ బాక్స్ విషయం చూస్తే టాటా స్కై మొత్తం నాలుగు బాక్స్ లను అందిస్తు చార్టులో ముందుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కూడా మూడు రకాల బాక్స్‌లు- ఎస్‌డి, హెచ్‌డి మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ లను అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ యొక్క డిజిటల్ టీవీ ఆర్మ్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీని కూడా అందిస్తోంది. అయితే ఇది కొన్ని రోజుల క్రితమే ప్రారంభించింది. డిష్ టీవీ,సన్ డైరెక్ట్‌ మరియు డి 2 హెచ్ తమ కస్టమర్లకు కేవలం హెచ్‌డి మరియు ఎస్‌డి వంటి రెండు సెట్-టాప్ బాక్స్ వేరియంట్‌లను మాత్రమే అందిస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Set-Top Boxes Offers,Prices and Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X