ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై

|

ఇండియాలో ప్రస్తుతం అన్ని DTH ఆపరేటర్లలో ఎక్కువగా ఇష్టపడే వాటిలో టాటా స్కై ఒకటి. ఈ కంపెనీకి ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత సెట్-టాప్ బాక్స్ లేనప్పటికీ చాలా మంది కస్టమర్లు టాటా స్కైని ఎంచుకుంటున్నారు. అందుకు గల కారణం దాని అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ మరియు వివిధ రకాల ఛానల్ ప్యాక్‌లను కలిగి ఉండడం.

టాటా స్కై
 

టాటా స్కై వివిధ క్యూరేటెడ్, రీజినల్ మరియు మెట్రో ప్యాక్‌ల ధరలను కొన్ని రోజు క్రితం చిన్న తేడాతో తగ్గించింది. a-la-కార్టే ఛానెళ్లపై ఎక్కువగా ఆధారపడే టాటా స్కై కస్టమర్లు 26 ముఖ్యమైన ఛానెళ్లను తక్కువ ధరలకు పొందవచ్చు. దీపావళి పండుగ కాలంలో బ్రాడ్ క్యాస్టర్స్ చాలా ఛానెల్‌లను డిస్కౌంట్ ధర వద్ద అందించారు.

వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ వచ్చిందా.... జాగ్రత్త....

ఛానెల్‌

అదే ఆఫర్ ను ఇప్పటి వరకు కోసాగిస్తున్నారు. టాటా స్కై చందాదారులు రాయితీ ధరలకు పొందగల కొన్ని ఛానెల్‌లలో Zee టీవీ, Zee మరాఠీ, ఏషియనెట్ మొదలైనవి ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

టాటా స్కై ప్లాట్‌ఫామ్‌లో తగ్గిన రేట్లతో 26 ఛానెల్‌లు
 

టాటా స్కై ప్లాట్‌ఫామ్‌లో తగ్గిన రేట్లతో 26 ఛానెల్‌లు

కొత్త టారిఫ్ పాలన తరువాత డిటిహెచ్ మరియు కేబుల్ టివి ఆపరేటర్లు చందాదారులకు నిర్ణీత రేటుకు a-la-కార్టే ఛానెళ్లను అందిస్తున్నారు. a-la-కార్టే ఛానెల్‌లను రెండు రకాలుగా విభజించారు. అందులో ఒకటి పైడ్ a-la-కార్టే మరియు రెండవది FTA a-la-కార్టే ఛానెల్‌లు. ప్రస్తుతం టాటా స్కై 26 పైడ్ a-la-కార్టే ఛానెల్‌లను చందాదారులకు డిస్కౌంట్‌ ధర వద్ద అందిస్తోంది. ఆ ఛానెల్‌లు వరుసగా Zee టీవీ, Zee మరాఠీ, జీ బంగ్లా, Zee సార్థక్, Zee కన్నడ, Zee తెలుగు, ఏషియానెట్, ఏషియానెట్ మూవీస్, స్టార్ మా, నేషనల్ జియోగ్రాఫిక్, స్టార్ జైషా, స్టార్ ప్లస్, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ విజయ్ , విజయ్ సూపర్, హంగమా టీవీ, సెట్, సోనీ సాబ్, కలర్స్, కలర్స్ కన్నడ, సోనీ మాక్స్, జీ తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా, నాట్ జియో వరల్డ్ మరియు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్.

ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

 ధరల వివరాలు

ధరల వివరాలు

పైన పేర్కొన్న అన్ని జీ ఛానెల్‌లకు సాధారణంగా అన్ని రకాల పన్నులతో కలిపి నెలకు రూ.22.42 ఖర్చవుతుంది. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా వాటి ధర కేవలం రూ.14.16లకు లభిస్తుంది. టాటా స్కై చందాదారులు సంస్థ యొక్క మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ఛానెల్‌లను ఎంచుకోవచ్చు. టాటా స్కై ఈ ఛానెల్‌లను తన వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కావున వెంటనే దీనిని పొందండి. ఆఫర్ ముగిసిన తర్వాత మొత్తం 26 ఛానెల్‌లు వాటి అసలు నెలవారీ ధరలకు తిరిగి వస్తాయి.

జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

HD మరియు SD ఛానెల్‌లు

HD మరియు SD ఛానెల్‌లు

టాటా స్కై ప్రస్తుతం తన ప్లాట్‌ఫామ్‌లోని వినియోగదారులకు మొత్తంగా 585 ఎస్‌డి మరియు హెచ్‌డి ఛానెళ్లను అందిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 550-560 మధ్య ఉండేది. కాని టాటా స్కై తన పోర్ట్‌ఫోలియోకు ఇప్పుడు మరిన్ని ఛానెల్‌లను జోడించింది. టాటా స్కై ప్రస్తుతం Zee, స్టార్, టివి 18, సన్, సోనీ, డిస్కవరీ, టైమ్స్, రాజ్ టివి, డిస్నీ, టర్నర్ వంటి వివిధ ప్రసారాల నుండి ఛానెల్‌లను అందిస్తోంది.

టాటా స్కై

మొత్తం 585 ఛానెల్‌లలో పైన పేర్కొన్న రాయితీ ఛానెల్ కూడా ఉన్నాయి. హెచ్‌డి ఛానెల్‌ల విషయానికొస్తే టాటా స్కై మొత్తంగా 92 ఛానెల్‌లను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీతో పోల్చితే టాటా స్కై అత్యధిక సంఖ్యలో ఛానెల్‌లను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో 307 పైడ్ a-la-కార్టే ఛానెల్స్ మరియు 262 ఎఫ్‌టిఎ a-la-కార్టే ఛానెల్‌లు ఉన్నాయి. FTA ఛానల్ జాబితాను ట్రాయ్ స్వయంగా నిర్ణయిస్తున్నారు కాబట్టి ఈ జాబితా టాటా స్కైలో కూడా సమానంగా ఉంటుంది. అదనంగా టాటా స్కైకి a-la-కార్టే ఛానెల్‌లలో వన్డే లాక్-ఇన్ పీరియడ్ ఉందని గమనించాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Now Offers 26 Most Popular Channels at Very Low Prices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X