ఉచిత కాలింగ్ ఆఫర్ ఎలా ఇస్తారు ? జియోకి ట్రాయ్ షాక్

Written By:

వాయిస్ కాల్స్ కు ఇంటర్ కనెక్టింగ్ విషయంలో టెల్కోలతో ఇప్పటికే సతమతమవుతున్న రిలయన్స్ జియోకు ఇప్పుడు ట్రాయ్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉచితం అంటూ కష్టమర్లను తన వైపు తిప్పుకున్న జియోకి ఆ ఉచితమే ఇప్పుడు ఎసరు తెచ్చేలా ఉంది. అదెలాగో మీరే చూడండి.

జియోకి పంచ్ : 3 నెలలు ఉచిత అన్‌లిమిటెడ్ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివరణ ఇవ్వాల్సిందేనంటూ

ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లు ఎలా ఇస్తారు.. ఏ ప్రాతిపదికన ఇస్తారు..అనే దానిపై వివరణ ఇవ్వాల్సిందేనంటూ టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు షాకిచ్చింది.

వాయిస్ టారిఫ్ ప్లాన్

రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో వాయిస్ టారిఫ్ ప్లాన్ నిమిషానికి 1.20పైసలుండగా.. ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ఎలా అందిస్తాన్నారో తెలుపాల్సిందేనని ట్రాయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది.ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నట్టు దీనిపై వివరణ కావాలంటూ ట్రాయ్ కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ అందించే టారిఫ్ ప్లాన్ వివరాలు

ఈ విషయంపై సీనియర్ ట్రాయ్ అధికారులు, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లతో భేటీ అయినట్టు తెలిపాయి. కంపెనీ అందించే టారిఫ్ ప్లాన్ వివరాలు కోరినట్టు, ఈ విషయంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పాయి.

సెకనుకు 2 పైసలు

అయితే దీనికి రిలయన్స్ జియో కాల్ ప్లాన్ కింద రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని తెలిపింది. అంటే నిమిషానికి 1.20 పైసలన్నమాట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిమ్ కార్డ్ బ్రోచర్స్ పైనే

సిమ్ కార్డ్ బ్రోచర్స్ పైన కూడా కస్టమర్లకు ఇదే కనిపిస్తుంది. అయితే ఉచిత కాల్స్ ప్రకటనకు, రెగ్యులేటరీ సమర్పణకు టారిఫ్ ప్లాన్స్‌లో తేడాపై రిలయన్స్ జియో స్పందించడంలేదు.

కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం

దీనిపై కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం లేదని పలు టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 2004లో టెలికాం రెగ్యులేటరీ తయారుచేసిన టెలికాం టారిఫ్ ప్లాన్‌ను సైతం రిలయన్స్ జియో సవరించనుందని తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెలికాం కంపెనీలు

మాములుగా అయితే ఈ టారిఫ్ ఫ్లాన్ ప్రకారం టెలికాం కంపెనీలు ఇంటర్‌కనెక్ట్ యూజర్ చార్జీల(ఐయూసీ) కంటే తక్కువగా టారిఫ్‌లు ఉండటానికి ఇష్టపడవు. అందుకు ఒప్పుకోవు

ఐయూసీ రేట్ నిమిషానికి 14 పైసలు

ప్రస్తుతం ఐయూసీ రేట్ నిమిషానికి 14 పైసలుగా ఉంది. ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్స్‌తో రిలయన్స్ జియో దోపిడీ పద్ధతులకు తెరతీసిందని ఇతర టెలికాం కంపెనీలు తీవ్రం‌గా ఆరోపిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముందు ముందు జియో

మరి ముందు ముందు జియో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుందనేది టెక్ వర్గాలను సైతం కలవరపరుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఉచితం హుష్ కాకి

ఉచితం హుష్ కాకి : జియో సిమ్ ఖరీదు రూ. 500 ! మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
TRAI seeks explanation from Reliance Jio on free voice calls read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting