Xiaomi 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఇండియా లాంచ్ టీజ్ విడుదలైంది...

|

షియోమీ స్మార్ట్‌ఫోన్‌ సంస్థకు ఇండియాలో మొబైల్ రంగంలో అతి పెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. ఈ సంస్థ త్వరలోనే షియోమీ 12 ప్రో 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన టీజర్ ను షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ విడుదల చేసారు. షియోమీ 12 ప్రో 5Gని భారతదేశంలో ఏప్రిల్ 12, 2022న విడుదల చేస్తున్నట్లు విడుదలైన టీజర్ సూచిస్తోంది. షియోమీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో షియోమీ 12 సిరీస్‌ను విడుదల చేసింది. షియోమీ 12 ప్రో 5G ఇండియా లాంచ్ కి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అధికారిక ట్విట్టర్ హ్యాండిల్

కంపెనీ ఇంకా ఖచ్చితమైన ప్రారంభ తేదీని అధికారికంగా విడుదల చేయనప్పటికీ Xiaomi తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక ప్రకటన చేసింది. ఆ ట్వీట్‌లో "జీవితం ఒక ప్రదర్శన, వేచి ఉండటాన్ని విలువైనదిగా చేద్దాం. #Xiaomi12Pro 5G త్వరలో భారతదేశంలోకి రాబోతోంది! ఎందుకంటే "ది షోస్టాపర్" లేకుండా ప్రదర్శన అసంపూర్ణంగా ఉంటుంది. Xiaomi 12 Pro ఈ నెలలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు మరియు ఇది Xiaomi 11 సిరీస్‌ని కొత్త ఫ్లాగ్‌షిప్‌గా భర్తీ చేస్తుంది.

Xiaomi 12 Pro 5G స్పెసిఫికేషన్‌లు

Xiaomi 12 Pro 5G స్పెసిఫికేషన్‌లు

షియోమీ 12 ప్రో 5G ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది 6.73-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 2K రిజల్యూషన్, 1500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR10+ సర్టిఫికేషన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇండియా యొక్క వేరియంట్ కూడా దాదాపుగా ఇవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇండియా వేరియంట్ అదనపు రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉండవచ్చు.

షియోమీ 12 ప్రో 5G

షియోమీ 12 ప్రో 5G ఫోన్ Samsung యొక్క 4nm ప్రాసెస్ ఆధారంగా Qualcomm Snapdragon 8 Gen1 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13లో రన్ కావచ్చు. అలాగే కెమెరా విభాగంలో 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50MP సోనీ IMX707 ప్రైమరీ సెన్సార్ మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP పోర్ట్రెయిట్ లెన్స్‌తో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా లేఅవుట్‌ను చూడవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP స్నాపర్ ఉండవచ్చు.

గ్లోబల్ వేరియంట్

షియోమీ 12 ప్రో 5G ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇండియా వేరియంట్ కూడా ఇదే ఫీచర్లను కలిగి ఉండవచ్చు. అయితే ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ లీక్‌లలో ధరల వివరాలు ఇంకా విడుదల కాలేదు. షియోమీ 12 ప్రో 5G ఫోన్ పోటీ ధరతో లాంచ్ చేయబడితే 2022లో రాబోయే ఫ్లాగ్‌షిప్‌లకు పోటీని ఇచ్చే పరికరం అవుతుంది. మార్చి 31న భారతదేశంలో అధికారికంగా విడుదలైన OnePlus 10 Pro 5G, Xiaomi 12 Pro 5Gకి దాదాపు అదే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. పోటీలో ఏ పరికరం బాగా రాణిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 12 Pro 5G India Launch Confirming Teaser Released Manu Kumar Jain

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X