జూన్ లో తక్కువ బడ్జెట్ లో ఉత్తమమైన ఫోన్లు

|

పాత కాలం మాదిరి కాకుండా 10,000రూపాయల కంటే తక్కువ గల స్మార్ట్ ఫోన్లు పరిమిత కార్యాచరణలను అందించవు.ఇవి అత్యాధునిక రూపకల్పనతో మరియు మరింత మెరుగైన నమ్మదగిన ప్రాసెసర్లతో ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో ఫోన్లు ఈ సంవత్సరం ప్రారంభించబడినవి. ఈ కొత్త ఫోన్లు స్పెసిఫికేషన్స్ పరంగా చాలా బాగున్నాయి మరియు కెమెరాలు కూడా చాలా మెరుగుపడ్డాయి.

xiaomi redmi note 7s to samsung galaxy m10 best smartphones under rs 10 000

ఒక వేల మీరు 10,000 రూపాయల లోపు కొత్త బడ్జెట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు కావలిసిన ఫోన్‌ల జాబితా ఇక్కడ ఉంది.

షియోమి రెడ్‌మి నోట్ 7S :

షియోమి రెడ్‌మి నోట్ 7S :

వెనుక వైపు 48 మెగాపిక్సెల్ కెమెరాతో గల ఫోన్ను కొనాలనుకుంటున్నారా? అయితే షియోమి రెడ్‌మి నోట్ 7S మీకు మంచి ఎంపిక దీని యొక్క ధర 10,999రూపాయలు. షియోమి రెడ్‌మి నోట్ 7S 10,000 రూపాయల మార్కును దాటింది అయిన ఇది పరిగణలోకి తీసుకోబడింది. 3 జీబీ ర్యామ్‌తో మరియు నమ్మకమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేసే రెడ్‌మి నోట్ 7S 48 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ ఎఐ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.ఇది 6.3-అంగుళాల ఫుల్ HD + డాట్ నాచ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది ఇది అన్ని డిస్ప్లే లో ఉత్తమమైనది. ఈ స్మార్ట్‌ఫోన్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. రెడ్‌మి నోట్ 7S 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.మీరు అదనంగా 999రూపాయలు ఖర్చు చేయగలిగితే మీరు షియోమి యొక్క రెడ్‌మి 7 ను పొందవచ్చు. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి లేదు కాని నోట్ 7 ఎస్ వలె ఎక్కువ లేదా అంతకంటే తక్కువ స్పెసిఫికేషన్స్ ను కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M10:

శామ్సంగ్ గెలాక్సీ M10:

గెలాక్సీ M10 శామ్సంగ్ కొత్త బడ్జెట్ శ్రేణిలో చౌకైన సమర్పణ. గెలాక్సీ M10 ఇన్ఫినిటీ-వి డిస్ప్లే, మరియు వెనుక వైపు స్పోర్ట్స్ డ్యూయల్ 13-మెగాపిక్సెల్+ 5 మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తుంది. ఇది సెల్ఫీస్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.శామ్సంగ్ గెలాక్సీ M10 రూ .8,990 ధరతో వస్తుంది.ఇది 3 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయంలో ఇది కొత్త OneUI పై నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్లో 3,400 mAh బ్యాటరీ పెద్ద ఆకర్షణగా ఉంది. అయితే ఇది వేలిముద్ర సెన్సార్‌తో రాదు బదులుగా సాంప్రదాయ ఆన్-స్క్రీన్ అన్‌లాక్ ఫీచర్ మరియు ఫేస్ అన్‌లాక్‌పై ఆధారపడుతుంది.

రియల్ మి 3:

రియల్ మి 3:

ఈ జాబితాలో వున్న మరొక విలువైన స్మార్ట్ ఫోన్ రియల్‌ మి3.ఇది మీడియాటెక్ హెలియోP70 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 13 మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ సెన్సార్స్ బ్యాక్ సైడ్ కెమెరాలను మరియు ముందువైపు సెల్ఫీస్ కోసం 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.డిస్ప్లే విషయంలో ఇది 6.2 అంగుళాల HD + డిస్ప్లే ను కలిగి ఉంటుంది.ఈ మొబైల్ లో మరొక అద్భుతమైన విషయం దీని యొక్క 4,230mAh బ్యాటరీ.ఈ ఫోన్ 3GBRAM +32GBస్టోరేజ్ మరియు 4GBRAM +64GB స్టోరేజ్ రకాల్లో అందుబాటులో ఉంది. రియల్ మి3 ప్రారంభ ధర 8,999 రూపాయల వద్ద లభిస్తుంది.

షియోమి రెడ్‌మి Y3:

షియోమి రెడ్‌మి Y3:

Redmi Y సిరీస్ సెల్ఫీ కెమెరాలకు ప్రసిద్ధి చెందింది. తాజా రెడ్‌మిY3 కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది బ్యాక్ ప్యానెల్ విషయంలో మంచి ప్రవణత డిజైన్ ను కలిగి ఉంటుంది.ఇది 6.2-అంగుళాల HD + డాట్ నాచ్ డిస్ప్లే తో మరింత శుద్ధి రూపకల్పనతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్ ఆధారితంగా పని చేస్తుంది. Redmi Y3 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ AI డ్యూయల్-బ్యాక్ సైడ్ కెమెరాలు ఉన్న షియోమి రెడ్‌మిY3 మొబైల్ ఆన్‌లైన్‌లో 9,999రూపాయల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A10:

శామ్సంగ్ గెలాక్సీ A10:

శామ్సంగ్ యొక్క కొత్త గెలాక్సీA సిరీస్‌లో భాగంగా గెలాక్సీA10 మెరుగైన డిజైన్ మరియు పోటీ వివరాలతో వస్తుంది. ఇది గెలాక్సీ ఎం 10 తో కొన్ని సారూప్యతలను పంచుకుంటుంది. అయితే ఇది గెలాక్సీ ఎం 10 కంటే మంచి డిజైన్‌ను కలిగి ఉంది. గెలాక్సీ ఎ 6.2-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇదిబ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. మరియు ఇది 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది అంతర్గత Exynos 7884 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజీతో మరియు 2 జిబి ర్యామ్‌ తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3,400 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది . సాఫ్ట్‌వేర్ విషయంలో ఇది కొత్తగా వచ్చిన OneUIతో నడుస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీA10 రూ .8,490 వద్ద లభిస్తుంది.

Best Mobiles in India

English summary
xiaomi redmi note 7s to samsung galaxy m10 best smartphones under rs 10 000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X