ఈ యాప్స్ మీ కోసమే..

|

ఒక సంస్థ లేదా మేనేజ్‌మెంట్ విజయపథంలో ముందుకు నడవాలంటే టీమ్ వర్క్ అనేది ఎంతో ముఖ్యం. గతంలో టీమ్ కమ్యూనికేషన్ అనేది ఈ-మెయిల్స్ మధ్య నడిచేది. ఆటోమేటెడ్ ఇమెయిల్స్ అందుబాటులోకి వచ్చేసిన తరువాత వీటిలో పస తగ్గిపోవటంతో చాలా మంది ఈ మూస పద్థతిని టీమ్ కమ్యూనికేషన్ నిమిత్తం ఉపయోగించుకోవటం దాదాపుగా మానేసారు. ఆ తరువాత ఈ-మెయిల్ స్థానంలోకి 'స్లాక్’ (Slack) పేరుతో ఓ క్లౌడ్ ఆధారిత ప్రొప్రైటరీ కొలాబరేషన్ టూల్ అందుబాటులోకి వచ్చింది.

 
ఈ యాప్స్ మీ కోసమే..

ఈ ఇంటర్నల్ టూల్ ద్వారా కమ్యూనిటీస్, గ్రూప్స్ లేదా టీమ్స్ ఓ నిర్దిష్టమైన URL ద్వారా ఎక్కడినుంచైనా కమ్యూనికేట్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రధానంగా టీమ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఇంకా అప్‌ టు‌ డేట్ కమ్యూనికేషన్ షేరింగ్ అంతా ఒకే పేజీపై జరిగేేలా చూస్తుంది.

ఇదే సమయంలో వివిధ వర్చువల్ ఛానల్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను గ్రూప్ సభ్యులు ఇక్కడే పొందే వీలుంటుంది. 'స్లాక్’ టూల్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇంకా వెబ్ బ్రౌజర్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే స్లాక్ అప్లికషన్‌ను వినియోగించుకుంటున్నట్లయితే, ఈ టూల్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతోన్న 5 ప్రత్యామ్నాయ యాప్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తన్నాం.

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్

ఈ యాప్ ప్రత్యేకించి వీడియో మెసేజింగ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. గూగుల్ డ్రైవ, గూగుల్ డాక్స్ వంటి ఇతర గూగుల్ అప్లికేషన్‌లతో ఇంటిగ్రేట్ అయి ఉండే ఈ యాప్‌ను టీమ్ కమ్యూనికేషన్ నిమిత్తం ఎక్కువుగా వినియోగించుకుంటున్నారు. ఈ అప్లికేషన్‌కు జెన్‌డెస్క్, ఉబెర్‌కాన్ఫిరెన్స్, హిప్‌చాట్ వంటి సర్వీసులను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.

ఫ్లీప్

ఫ్లీప్

ఈ అప్లికేషన్ ద్వారా ఈమెయిల్ ఐడీని కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి మెసేజ్‌లను పంపే వీలుంటుంది. ఫ్లీప్ టూల్ ద్వారా క్లోజుడ్ టీమ్ ఇకోసిస్టంలా ప్రతిఒక్కరితో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసే వీలుంటుంది. ఈ యాప్ ఆఫర్ చేసే ఫ్రీ ప్యాకేజీలో అన్‌లిమిటెడ్ మెసేజ్ హిస్టరీ సదుపాయంతో పాటు అన్‌లిమిటెడ్ ఇంటిగ్రేషన్స్ సదుపాయం కూడా ఉంటుంది.

బిట్రిక్స్ 24
 

బిట్రిక్స్ 24

స్లాక్ టూల్‌కు ప్రత్యామ్నాయంగా లభ్యమవుతోన్న యాప్‌లలో బిట్రిక్స్ 24 ఒకటి. ఈ యాప్‌లో భాగంగా 39 డాలర్ల నుంచి 199 డాలర్ల వరకు వివిధ రేంజ్‌లలో ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో ఫ్రీ ప్లాన్ అందుబాటులో ఉన్నప్పటికి లిమిటెడ్ ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోర్ స్ర్కీన్ షేరింగ్, అన్‌లిమిటెడ్ సెర్చ్ హిస్టరీ, ఫ్రీ వీడియో చాట్ వంటి స్పెషల్ ఫీచర్లను ఈ సర్వీస్ ఆఫర్ చేస్తుంది.

ఆపిల్ నుంచి ఒకేసారి మూడు ఐఫోన్లు, భారీ డిస్‌ప్లే, బడ్జెట్ ధర..ఆపిల్ నుంచి ఒకేసారి మూడు ఐఫోన్లు, భారీ డిస్‌ప్లే, బడ్జెట్ ధర..

గ్లిప్

గ్లిప్

ఈ ఆల్-ఇన్-వన్ యాప్ ద్వారా లిస్ట్స్, క్యాలెండర్స్ ఫైల్స్, నోట్స్, వీడియో కాలింగ్, మెసేజింగ్ ఇలా అన్నీ ఒకే చోట నిర్వహించుకునే వీలుంటుంది. మేనేజింగ్ ప్రాజెక్ట్స్, వర్కింగ్ ఆన్ ద గో, ఇంటరాక్టింగ్ విత్ క్లయింట్స్ వంటి కీలక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. ఫ్రీ ఇంకా ప్రీమియమ్ రేంజ్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

రివర్

రివర్

టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా టాస్క్ మేనేజ్‌మెంట్ ఫీచర్లతో వస్తోన్న అత్యుత్తమ యాప్‌లలో Ryver యాప్ ఒకటి. గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి బిల్ట్-ఇన్ ఇంటిగ్రేషన్స్‌ను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేరుగా ఈ ఫైల్స్‌ను అక్కడి నుంచే సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. FreeConference ఇంటిగ్రేషన్ ద్వారా 400 మంది సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ఆడియో కాల్స్‌తో పాటు వీడియో కాల్స్‌ను నిర్వహించుకునే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
When it comes to work, team communication is more important for any enterprises. If in case, your team got bored of Slack, we provide you 5 alternative apps that you can try.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X