ఒక యాప్‌లో 135 సర్వీసులు, లోన్లు కూడా..

గ్రామీణ ప్రాంత కష్టమర్లకు కోసం ఐసిఐసిఐ బ్యాంక్‌ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మేరా ఐమొబైల్‌ పేరుతో ఐసిఐసిఐ ఈ యాప్‌ను రిలీజ్ చేసింది.

By Hazarath
|

గ్రామీణ ప్రాంత కష్టమర్లకు కోసం ఐసిఐసిఐ బ్యాంక్‌ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మేరా ఐమొబైల్‌ పేరుతో ఐసిఐసిఐ ఈ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా 135 రకాల సర్వీసులను పొందవచ్చు.అంతేకాకుండా వ్యవసాయ సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మరో సంచలనం

ICICI

ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లే కాకుండా ఇతర కస్టమర్లు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ తెలుగు సహా పదకొండు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం విశేషం. ఏదైనా సమాచారం అవసరం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంత కస్టమర్లు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం ఎంతో సమయాన్నే కాకుండా డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ !

ICICI

ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే అన్ని రకాల సమాచారాన్ని అందించే యాప్‌ను ఐసిఐసిఐ బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, బంగారం రుణం, వ్యవసాయ పరికరాల రుణం, స్వయం సహాయక సంఘాలకు రుణాలు తదితరాలకు సంబంధించిన సర్వీసులు ఈ యాప్‌లో ఉన్నాయి.

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

ICICI

తరచుగా ఉపయోగించే కొన్ని సర్వీసులను ఇంటర్నెట్‌ సర్వీసు లేకపోయినప్పటికీ వాడుకోవచ్చని బ్యాంకు చెబుతోంది. మేరా ఐమొబైల్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
ICICI 'Mera iMobile' Mobile Banking App Launched for Rural Customers read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X