ఫేస్‌బుక్ మరో సంచలనం

Written By:

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సంచలనానికి తెరలేపనుంది. త్వరలోనే నాలుగు కొత్త ఉత్పత్తులను వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యంగా ఓ ప్రొడక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. వ్యక్తి ఆలోచనను పసిగట్టే పరికరాన్ని(మైండ్ రీడింగ్ డివైజ్) మార్కెట్లోకి తెస్తామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు.

BSNL ఉచిత డేటా, వారికి మాత్రమే

ఫేస్‌బుక్ మరో సంచలనం

వచ్చే నెలలోనే ఈ సస్పెన్స్‌కు తెర పడనుంది. ఫేస్‌బుక్ సంస్థ గతేడాది 'బిల్డింగ్ 8' అనే పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మనిషి మెదడు ఏం ఆలోచిస్తుంది, ఆ ఆలోచనలను, వాటి భావాలను పసిగట్టగలిగే 'మైండ్ రీడింగ్' డివైజ్ రూపకల్పనలో ఇంజినీర్లు బిజీగా ఉన్నారు. ఆలోచనను పసిగట్టిన డివైజ్ ఆ వివరాలను ఫోన్ ద్వారా ఇతరులకు చెప్పేస్తుంది.

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

మిలియన్ల కొద్ది డివైస్‌లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించాలని కొన్ని కంపెనీలు ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాయి.

మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు Jio Prime గడువు..?

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే.. ఏంటో మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కన్పర్మ్

చాలామంది న్యూస్ నిజమో కాదో తెలుసుకోకుండానే పోస్ట్ చేస్తుంటారు. అలాగే న్యూస్ చదవకుండా చాలామంది షేర్ కూడా చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. న్యూస్ పోస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే కన్పర్మ్ చేసుకుని పోస్ట్ చేయండి.

హాలిడే ట్రిప్ వివరాలు

మీరు మీ హాలిడే ట్రిప్ వివరాలు అందులో పోస్ట్ చేయడం వల్ల మీ కొంపను దొంగలు కొల్లేరు చేసే అవకాశం లేకపోలేదు. ఇది కొన్ని చోట్ల జరిగింది కూడా. కాబట్టి దీనికి వీలైనంత దేరంగా ఉండండి.

ఫేస్‌బుక్‌లో చాటింగ్ సమయాల్లో

డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్‌బుక్‌లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.

టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి

ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు.

ట్యాగ్ లైన్

మీరు మీ ట్యాగ్ లైన్ ను ఎప్పుడూ సేప్టీలో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా అపరిచితుల నుంచి మీ టైమ్ లోనికి ఎటువంటి న్యూస్ రాదు. ఒకవేళ అపరిచితులు న్యూస్ పంపినా దానిని యాడ్ చేయాలా వద్దా అని మిమ్మల్ని అడుగేలా సెట్ చేసుకోండి.

యజమానికి సంబంధించిన ఫిర్యాదులు

ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook to reveal secret 'mind-reading device' at event in April, claims report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot