ఉచితంగా యాంటీ వైరస్ టూల్స్ , ఐటీశాఖ కొత్త యాప్

కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌/మొబైల్‌ ఫోన్‌ను సైబర్‌ దాడుల నుంచి రక్షించుకునేందుకు ఐటీ శాఖ కొత్త యాప్

By Hazarath
|

కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌/మొబైల్‌ ఫోన్‌ను సైబర్‌ దాడుల నుంచి రక్షించుకునేందుకు మీరు ఇప్పుడు గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా సైబర్‌ స్వచ్ఛత కేంద్ర వెబ్‌సైట్‌ (www.cyberswachhtakendra.gov.in) నుంచి ఉచితంగా ప్రభుత్వం రూపొందించిన ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

హెచ్‌టీసీ వన్ X10 లీకయింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

 
it

సైబర్‌ దాడులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో వాటి నుండి రక్షణకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సాయంతో 'సైబర్‌ స్వచ్ఛత కేంద్ర' ద్వారా కొత్త డెస్క్‌టాప్‌ అండ్‌ మొబైల్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

శాంసంగ్ కార్నివాల్, భారీ డీల్స్‌కి తెరలేపిన అమెజాన్

it

వీటిల్లో వైరస్, మాల్వేర్‌ను విశ్లేషించే యాప్‌సంవిద్‌/యాప్‌వైట్‌ లిస్టింగ్, యూఎస్‌బీ ప్రతిరోద్‌ అనే టూల్స్‌ ఉన్నాయి. వీటిని సి-డాక్‌ అభివృద్ధి చేసింది.యూఎస్‌బీ ప్రతిరోద్‌ అనేది పోర్టబుల్‌ యూఎస్‌బీ స్టోరేజ్‌ పరికరాల అనధికార వినియోగాన్ని నియంత్రిస్తుంది.

6జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే, చేతికి చిక్కేనా !

it

ఇక యాప్‌సంవిద్‌ టూల్‌ విండోస్‌ పీసీలపై పనిచేస్తుంది. ఇది ముందస్తు అనుమతి ఉన్న యాప్స్, ఫైల్స్‌ను మాత్రమే అనుమతిస్తుంది. మిగతా అన్ని వైరస్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఇక్కడ ఇంకొక 'ఎం-కవచ్‌' టూల్‌ ఉంది. మొబైల్‌ ఫోన్ల భద్రతే లక్ష్యంగా దీన్ని తీసుకువచ్చారు. కాగా ఈ సొల్యూషన్స్‌ అన్నీ ఉచితం.

Best Mobiles in India

English summary
Now you can download free desktop, mobile security apps from govt website read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X