రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

Written By:

ఆపిల్, శాంసంగ్ ఫోన్లకు పోటీగా గూగుల్ తీసుకొచ్చిన తాజా స్మార్ట్‌ఫోన్‌ పిక్సల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దాదాపు 9 వేల తగ్గింపుతో దీనిని అందిస్తోంది. అలాగే ఫాత ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ పై రూ. 20 వేల తగ్గింపును అందిస్తోంది. మొత్తం రూ. 29 వేల తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఫోన్ 32 జిబి వేరియంట్ ధర రూ. 57 వేలు.

ఇండియాకి జై కొట్టిన మరో మొబైల్ దిగ్గజం

రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

అయితే ఈ ఆఫర్ సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ఎక్స్ఛేంజి ఆఫర్‌ ద్వారా ఫోన్‌ కొనుగోలు చేసేవారికి మాత్రమే వరిస్తుంది. క్రెడిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ ద్వారా నేరుగా చెల్లించేవారికి రూ.9వేలు తగ్గింపు వర్తిస్తుంది. ఈ మొత్తం మొబైల్‌ కొనుగోలు చేసిన 90రోజుల తర్వాత వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది. ఒక కార్డుపై ఒకసారి మాత్రమే కొనుగోలుకు వీలుపడుతుంది.

ఫేస్‌బుక్‌లో లైకులు కొడుతున్నారా..?

రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

ఇదే ఆఫర్‌ 128జీబీ వేరియంట్‌కూ వర్తిస్తుంది. ఆ మోడల్‌ ధర రూ.66వేలు కాగా, డిస్కౌంట్‌ పోను రూ.37వేలకు లభిస్తుంది. పిక్సల్, పిక్సల్ Xl ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

పాత ఫోన్ ఇవ్వండి, 18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ ఇంకా గ్లాస్ కాంబినేషన్‌లో

గూగుల్ Pixel ఫోన్ 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోండగా, Pixel XL ఫోన్ 5.5 హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. గొరిల్లా గ్లాస్ 4 కోటింగ్ ఈ ఫోన్ డిస్‌ప్లేలకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆల్యూమినియమ్ మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో రూపొందించడని ప్రత్యేకమైన ఫ్రేమ్‌లను ఈ ఫోన్‌ల వెనుక భాగంలో అమర్చారు.

లెటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం అయిన 7.1 Nougat పై రన్ అవుతాయి.

శక్తివంతమైన ప్రాసెసర్..

2.15గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 821 64-బిట్ క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌లను ఈ రెండు ఫోన్‌లలో నిక్షిప్తం చేసారు.

ర్యామ్ ఇంకా స్టోరేజ్..

4జీబి ర్యామ్‌ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లు 32జబి అలానే 128జీబి స్టోరేజ్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటాయి.

కెమెరా విభాగాలను పరిశీలించినట్లయితే..

ఈ రెండు ఫోన్‌లలో కెమెరా విభాగాలను పరిశీలించినట్లయితే.. 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

ఈ రెండు ఫోన్‌లలో ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ వెనుక భాగంలో వీటిని ప్లేస్ చేయటం జరిగింది.

మూడు కలర్ వేరియంట్స్..

బ్లాక్, సిల్వర్ ఇంకా బ్లు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Google Pixel smartphone available at a discount of up to Rs 29,000 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting