జమ్ము కాశ్మీర్‌లో తక్కువ ధర ఫోన్స్ విడుదల...

Posted By: Super

జమ్ము కాశ్మీర్‌లో తక్కువ ధర ఫోన్స్ విడుదల...

 

ఇండియాలో గత 25 సంవత్సరాలుగా బిజినెస్ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న 'అరైజ్ ఇండియా లిమిటెడ్' కంపెనీ కొత్తగా మొబైల్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపింది. స్వతహాగా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న 'అరైజ్ ఇండియా లిమిటెడ్' కంపెనీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇండియా ఎకనమిక్‌ని చూస్తే తక్కువ ధర కలిగిన మొబైల్ హ్యాండ్ సెట్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఉండండతో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

'అరైజ్ ఇండియా లిమిటెడ్' రూపొందించిన 15 కొత్త మొబైల్ మోడల్స్‌ని మొదటగా జమ్ము అండ్ కాశ్మీర్‌లో విడుదల చేస్తున్నామన్నారు. మేము రూపొందించిన ఈ 15 కొత్త మొబైల్ ఫోన్స్ ఇండియన్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగిందన్నారు. 'అరైజ్ ఇండియా లిమిటెడ్' విడుదల చేస్తున్న అన్ని మొబైల్స్ కూడా 'అరైజ్ మొబైల్స్' బ్రాండ్ క్రింద విడుదల చేస్తామని అంటున్నారు.

మొదటగా జమ్ము అండ్ కాశ్మీర్‌లో మా మొబైల్స్‌ని విడుదల చేయడానికి గల కారణం ఇండియన్ మొబైల్ మార్కెట్లో మొదట 2-3 శాతం షేర్‌ని ఆక్రమించాలనే ఉద్దేశ్యంతో అక్కడ విడుదల చేస్తున్నామన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో కంపెనీ సుమారు 300కొట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. 2014 కల్లా కంపెనీ టార్గెట్ 1000 కొట్ల వరకు వెళ్లాలని కంపెనీ ప్రతినిధులు యోచనలో ఉన్నారు.

'అరైజ్ ఇండియా లిమిటెడ్' విడుదల చేయనున్న బిజినెస్ క్లాస్ మోడల్స్ రెండు(ఎ5, డబ్ల్యు1). రెండు మొబైల్స్ కూడా క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉన్నాయి. 'ఎ5 మోడల్ ఫోన్స్' ఇండియాలో మొట్టమొదటి నాలుగు సిమ్స్‌ని కలిగిన ఫోన్స్. ఇక 'డబ్ల్యు 1 మోడల్ ఫోన్స్' విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌ని కలిగి ఉండి, 3జీ నెట్ వర్క్ లేకపోయినప్పటికీ వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు.

అరైజ్ విడుదల చేయనున్న మొబైల్ ఫోన్ పేరు 'అరైజ్ టి777'. అరైజ్ టి777 మొబైల్ పుల్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. అదే విధంగా అరైజ్ టి222 మొబైల్ స్లిమ్‌గా ఉండడమే కాకుండా, మల్టీమీడియా కొసం ప్రత్యేకంగా రూపొందించిన కీస్ ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. అరైజ్ మొబైల్స్ నుండి విడుదలవుతున్న 15 మోడల్స్‌లలో కూడా బ్లూటూత్, కెమెరాని కామన్‌గా అమర్చడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot