శ్యామ్‌సంగ్ , మోటరోలాల మధ్య ఏం జరిగింది..?

Posted By: Prashanth

శ్యామ్‌సంగ్ , మోటరోలాల మధ్య ఏం జరిగింది..?

 

మొబైల్ ఫోన్ల పరిశ్రమను అంతర్జాతీయంగా శాసిస్తున్న రెండు బ్రాండ్లు శ్యామ్‌సంగ్ ( Samsung) అదే విధంగా మోటరోలా (Motorola)ల మధ్య క్వాలిటీ యుద్దం నడుస్తోంది. మన్నిక కోసం పాకులాడే ఈ బ్రాండ్లు హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ‘శ్యామ్ సంగ్ గెలక్సీ ఎస్ 2’, ‘మోటరోలా Razr XT910’ మెడల్స్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం...

శ్యామ్‌సంగ్ గెలక్సీ ఎస్ 2:

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డిస్‌ప్లే పరిమాణం 4.3 అంగుళాలు, రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సల్, డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ, 1650 mAh బ్యాటరీ వ్యవస్థ, ఆడియో మరియు వీడియో ప్లేయర్ సౌలభ్యత, బ్లూటూత్ అదేవిధంగా యూఎస్బీ కనెక్టువిటీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతం చేసేలా A-GPS టెక్నాలజీ. ధర రూ.30,000.

మోటరోలా Razr XT910:

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డిస్ ప్లే పరిమాణం 4.3 అంగుళాలు, రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా 1.3 మెగా పిక్సల్, 1.2 GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్ A9 ప్రాసెసర్, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ, 1780 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ, టాక్ టైమ్ 9 గంటలు, స్టాండ్ బై టైమ్ 304 గంటలు. డియో మరియు వీడియో ప్లేయర్ సౌలభ్యత, బ్లూటూత్ అదేవిధంగా యూఎస్బీ కనెక్టువిటీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతం చేసేలా A-GPS టెక్నాలజీ. ధర రూ.32,000 నుంచి రూ.33000 వేల మధ్య.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot