మార్కెట్లోకి వీడియోకాన్ బేసిక్ ఫోన్ 'విజి 1515'..

Posted By: Staff

మార్కెట్లోకి వీడియోకాన్ బేసిక్ ఫోన్ 'విజి 1515'..

వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న సంస్ద. త్వరలో మొబైల్ మార్కెట్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అందులో భాగంగానే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తక్కువ బరువు కలిగిన బార్ ఫోన్‌ 'వీడియోకాన్ విజి 1515'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఎక్కువ ఫీచర్స్ కలిగి సామాన్యాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మొబైల్‌ని రూపకల్పన చేసినట్లు వినికిడి.

నోకియా, మోటరోలా కంపెనీల నుండి విడుదలవుతున్న బేసిక్ ఫోన్స్ మాదిరే వీడియోకాన్ విజి1515 ఫోన్‌ని రూపోందించడం జరిగింది. వీడియోకాన్ విజి1515 మొబైల్ ఫోన్ ఫీచర్స్‌ని గనుక క్షుప్తంగా పరిశీలించినట్లైతే డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉండడమే కాకుండా, స్క్రీన్ సైజు 240 x 320 ఫిక్సల్‌ని ఇస్తూ టిఎఫ్‌టి డిస్ ప్లే దీని సొంతం. మొబైల్ వెనుక భాగాన 1.3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 1280 x 1024 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. చక్కని ఇమేజిలను తీసేందుకు గాను కెమెరాకి డిజిటల్ జూమ్ ఫీచర్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

వీడియోకాన్ విజి1515 ఫోన్‌లో ఉన్న జిపిఆర్‌ఎస్ ఆఫ్షన్ సహాయంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేయవచ్చు. ఇందులో ఉన్న డేటాని మీ కంప్యూటర్ లేదా వేరే మొబైల్ ఫోన్‌ పంపాలంటే బ్లూటూత్ ఫెసిలిటీని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న టి-ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్ ఎటువంటి నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు.

ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ వల్ల చక్కని పాటలను, వీడియోలను వినోచ్చు, చూడోచ్చు. దీనితో పాటు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లను కూడా ఈ మొబైల్ ద్వారా అనుసంధానం కావచ్చని ఓ రూమర్. పవర్ మేనేజ్ మెంట్ విషయానికి వస్తే లాంగ్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందిస్తుంది. ఈ నెల చివరికల్లా మార్కెట్లోకి విడుదల కానున్న ఈ మొబైల్ ధర సుమారుగా రూ 4,850 వరకు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot