రిలయన్స్ జియో & ఎయిర్‌టెల్ ప్రియమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

|

పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ వినియోగదారుల మధ్య ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట విభజన ఉంది. ఈ రకమైన కస్టమర్‌లు వారి సేవలను ఎలా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనేదానిలో తేడా ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కారణం వారు నిరంతరాయమైన సేవలను ఆస్వాదించాలనుకోవడం.

ఎయిర్టెల్
 

ముఖ్యంగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఎంచుకున్న ప్లాన్ కు అర్హత ఉన్న ప్రత్యేక ప్రయోజనాలను కూడా పొందారు. ఏదేమైనా ప్రస్తుతం మార్కెట్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వారి చందాదారుల కోసం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్రణాళికలలో కొన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్ల కంటే అధిక ఆఫర్లు మరియు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

చాలా మంది పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు బదులుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిగణనలోకి తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. ఒకవేళ మీరు మీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను భర్తీ చేయడానికి అనుకూలమైన ఎంపికలను అన్వేషిస్తూ ఉంటే కనుక రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ అందిస్తున్న ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్రణాళికలు కింద ఉన్నాయి ఒక సారి చూడండి.

పోస్ట్‌పెయిడ్‌కు బదులుగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్రణాళికలు

పోస్ట్‌పెయిడ్‌కు బదులుగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్రణాళికలు

ఈ జాబితాలో రిలయన్స్ జియో అందిస్తున్న మొదటిది రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది వినియోగదారులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. రిలయన్స్ జియో రూపొందించిన రూ.149ల ప్రీపెయిడ్ రీఛార్జ్ రోజుకు 1.5 జిబి డేటాను చందాదారులకు 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. దీని ద్వారా రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్ మరియు Jio యాప్ లకు యాక్సిస్ కూడా లభిస్తుంది.

జియో
 

రిలయన్స్ జియో రూపొందించిన రూ .198 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జిబి డేటాతో కాస్త అధిక డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు రిలయన్స్ జియో యాప్స్ లకు యాక్సిస్ ఇవ్వడం వంటి అన్ని ప్రయోజనాలతో కలిపి 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.

ఎయిర్‌టెల్‌కు

భారతి ఎయిర్‌టెల్‌కు కూడా ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో ఉంది. ఇది రిలయన్స్ జియో మాదిరిగానే ఉంటుంది. మేము ఇక్కడ జాబితా చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లను పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రణాళికల ప్రకారం చందాదారులకు రోజువారీ డేటా మరియు అపరిమిత కాలింగ్ ఎంపిక లభిస్తుంది. అదే ధర ట్యాగ్‌లతో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తక్కువ డేటాను ఆస్వాదించే అవకాశం ఉంది.

పోస్ట్‌పెయిడ్‌కు బదులుగా  భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్రణాళికలు

పోస్ట్‌పెయిడ్‌కు బదులుగా భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్రణాళికలు

ఇందులో మొదటిది భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ.199ల ప్రీపెయిడ్ ప్లాన్. ఇది రోజుకు 1.5 జిబి డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. రిలయన్స్ జియో ప్లాన్‌తో పోల్చితే దీని ధర అధికంగా ఉంది. కానీ ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ చందా, ఒక సంవత్సరానికి నార్టన్ సెక్యూరిటీ, షా అకాడమీలో 4 వారాల కోర్సుకు ఉచిత యాక్సిస్ వంటి ఇతర ప్రయోజనాలతో కూడా వస్తుంది. ఇవే కాకుండా ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ , ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు 28 రోజుల చెల్లుబాటుతో పొందవచ్చు.

ఎయిర్టెల్

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ చందాదారులకు అందిస్తున్న తరువాతి ప్లాన్ రూ.249 ల ప్లాన్‌ ఇది 2GB రోజువారీ డేటాను, అపరిమిత కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటు ఇది HDFC లైఫ్ నుండి రూ.4 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ యొక్క ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

ఎయిర్టెల్

అధిక డేటా వినియోగం కోసం ఎయిర్టెల్ అందిస్తున్న రూ.299ల ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వెళ్ళవచ్చు. ఇది రోజుకు 2.5 జిబి డేటాను,అపరిమిత కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ చందాను మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడి 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. చివరగా రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌ రోజుకు 3 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, షా అకాడమీ కోర్సు, వింక్ మ్యూజిక్, నార్టన్ మొబైల్ సెక్యూరిటీ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రయోజనాన్ని 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel and Reliance Jio Prepaid Plans Look More Attractive Than Postpaid Services

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X