జియోఫైబర్ ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చేయడం ఎలా?

|

జియో యొక్క వార్షిక సమావేశం గత నెలలో జరిగింది. ఈ సమావేశంలో జియోఫైబర్ సర్వీస్ ను మొదటిసారిగా ప్రకటించింది. జియో యొక్క వాగ్దానం ప్రకారం జియో ఫైబర్ ప్రణాళికలు సెప్టెంబర్ 5 న కంపెనీ వాటిని పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రణాళికలు అధికారికంగా ఉన్నాయి. జియోఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు కొంత మేరకు ఆకట్టుకొంటున్నాయి.

FUP
 

1,000 రూపాయల కంటే తక్కువ ధర గల ప్రణాళికలు చాలా పరిమితమైన FUP డేటాని అందిస్తున్నాయి. అయితే ఈ ప్రణాళికలు ఉచిత ఫిక్సడ్-లైన్ వాయిస్ కాలింగ్ సర్వీస్ మరియు 4K సెట్-టాప్ బాక్స్‌తో అందించబడతాయి. ఇప్పటికే 4 K సెట్-టాప్ బాక్స్ యొక్క దాని లక్షణాలను వివరించాము. కాని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ ల్యాండ్‌లైన్ కాలింగ్ సర్వీస్ JioFixedVoice గా పిలువబడుతుంది.

జియోకాల్

ఎయిర్‌టెల్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ ఇన్నేళ్లుగా బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లగా ఉండి వినియోగదారులకు ల్యాండ్‌లైన్ కాలింగ్ సేవలను అందించడం కొత్త విషయం కాదు. అయినప్పటికీ ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని సంస్థ జియో ఫిక్స్‌డ్ వాయిస్ సర్వీస్ వినియోగదారులను జియోకాల్ మొబైల్ యాప్ ద్వారా ఆరు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాయిస్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ అందించిన జియోఫైబర్ రౌటర్‌తో అనుసంధానించబడి ఉంటే వాయిస్ కాల్స్ చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

MyJio App లో JioFixedVoice ల్యాండ్‌లైన్ సేవను ఎలా యాక్టివేట్ చేయాలి?

MyJio App లో JioFixedVoice ల్యాండ్‌లైన్ సేవను ఎలా యాక్టివేట్ చేయాలి?

రియోలెన్స్ జియో అన్ని జియోఫైబర్ కస్టమర్లకు జియో ఫిక్స్‌డ్ వాయిస్ ల్యాండ్‌లైన్ కాలింగ్ సర్వీస్ ను అందిస్తోంది. ఈ సర్వీస్ ను యాక్టివేట్ చేయడానికి కింది పద్ధతులు పాటించండి.

1. ఇందులో మొదటిది వినియోగదారుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొవాలి.

2. డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి జియోఫైబర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.

3. మీరు జియోఫైబర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి MyJio యాప్ లోకి లాగిన్ అవ్వాలి మరొక మొబైల్ నంబర్ ద్వారా కాదు.

4. లాగిన్ అయిన తర్వాత ఆన్-స్క్రీన్ దశలను అనుసరించడం ద్వారా మీరు వాయిస్ కాలింగ్ సేవను సులభంగా యాక్టివేట్ చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లలో జియోకాల్ సెటప్ ప్రాసెస్
 

స్మార్ట్‌ఫోన్‌లలో జియోకాల్ సెటప్ ప్రాసెస్

రిలయన్స్ జియో వినియోగదారులు జియో ఫిక్స్‌డ్ వాయిస్ కనెక్షన్‌ను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లలో ఉచితంగా వాయిస్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. తెలియనివారి కోసం రిలయన్స్ జియోలో జియోకాల్ అనే అప్లికేషన్ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యామ్నాయ డైలర్‌గా పనిచేస్తుంది. అయితే ఈ సందర్భంలో వాయిస్ కాల్స్ చేయడానికి జియోకాల్ యాప్ వినియోగదారులను జియో ఫిక్స్‌డ్ వాయిస్ పది అంకెల ల్యాండ్‌లైన్ నంబర్ ద్వారా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది.

జియోకాల్

దీనిని ప్రారంభించడానికి మొదటగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి జియోకాల్ యాప్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ముందుకు కోనసాగడానికి యాప్ కు అవసరమైన అన్ని అనుమతులను ఇవ్వండి. అప్లికేషన్ ఇప్పుడు సెటప్ ప్రాసెస్ కోసం మొదటి బూట్ వద్ద మూడు ఎంపికలను అందిస్తుంది. అవి జియో 4G సిమ్ కార్డ్, జియోఫై కనెక్షన్ మరియు ఫిక్స్‌డ్ ల్యాండ్‌లైన్ సర్వీస్. మీ స్మార్ట్‌ఫోన్‌లో VoLTE సర్వీస్ లేకపోతే మీరు మొదటి ఎంపికను ఎంచుకోవచ్చు. మీరు మీ JioFi నంబర్ ద్వారా వాయిస్ కాల్స్ చేయాలనుకుంటే మీరు రెండవ ఎంపికను ఎంచుకోవచ్చు. చివరగా మీకు JioFixedVoice సర్వీస్ ఉంటే మీరు దానిని ప్రారంభించడానికి మూడవ ఎంపికను క్లిక్ చేయవచ్చు.

JioFixedVoice

ఫిక్స్‌డ్ ఎంపికను నొక్కిన తర్వాత నమోదు చేయడానికి ‘SSID పై నొక్కండి. యాప్ కు ఇప్పుడు OTP అవసరం అవుతుంది. ఈ OTP మీ యొక్క జియోఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది. OTP రెఫర్ చేసిన తరువాత మీరు JioFixedVoice ల్యాండ్‌లైన్ నంబర్‌ను ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్ నుండి ఉచితంగా వాయిస్ కాల్స్ చేయడాన్ని అనుమతిస్తుంది. జియో ఫిక్స్‌డ్ వాయిస్ నంబర్‌ను ఉపయోగించి ఆరు స్మార్ట్‌ఫోన్‌లలో జియోకాల్ యాప్‌ను సెటప్ చేయడానికి రిలయన్స్ జియో వినియోగదారులను అనుమతిస్తుంది.

జియోకాల్

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఫ్రీగా కాల్స్ చేయడానికి జియోకాల్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉచిత కాల్‌లు చేయడానికి మరియు స్వీకరించడానికి జియోఫైబర్ రౌటర్‌తో కనెక్ట్ అయి ఉండాలి. ఇది రిలయన్స్ జియో నుండి వచ్చిన ప్రత్యేకమైన సేవలలో ఒకటి. ఇది BSNL వింగ్స్‌తో సమానంగా ఉంటుంది.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు

రిలయన్స్ జియో ఇప్పటికే తన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను సెప్టెంబర్ 5 న వెల్లడించింది. జియోఫైబర్ ప్లాన్ యొక్క ధరలు 699 రూపాయల నుండి ప్రారంభమయి 8,499 రూపాయల వరకు ఉంటాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ యొక్క వేగం 100 Mbps నుండి 1 Gbps మధ్య ఉంటుంది. 100 Mbps వేగంతో అందిస్తున్న జియోఫైబర్ యొక్క బేస్ ప్లాన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినప్పటికీ FUP పరిమితి తక్కువగా ఉంది. జియోఫైబర్ అందిస్తున్న అన్ని ప్రణాళికలు కూడా ఉచిత JioFixedLine సేవతో వస్తాయి. వాయిస్ కాల్‌లకు ఎటువంటి FUP పరిమితి లేదు. ఇంకా కనెక్షన్‌ను ఎంచుకునేటప్పుడు జియోఫైబర్ కస్టమర్లకు 4K సెట్-టాప్ బాక్స్ కూడా లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
JioFiber Broadband Plans Ship With Free JioFixedVoice Service Through Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X