సెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

|

డిటిహెచ్ ఆపరేటర్లలో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న కారణంగా డిటిహెచ్ ప్రొవైడర్లు తమ సెట్-టాప్ బాక్సుల ధరలను తగ్గించారు. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా దాని STB ధరలను తగ్గించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కొత్త కస్టమర్లకు కేవలం రూ.1,300 ధరతో అందిస్తుండగా, ఎస్‌డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1,100ల ధర వద్ద అందిస్తున్నారు.

STB ధర
 

డిటిహెచ్ ఆపరేటర్లలో మిగిలిన వారి STB ధరలతో పోల్చితే టాటా స్కై యొక్క హెచ్‌డి STB ధర రూ .1,499, ఎస్‌డి STB ధర రూ .1,399. అలాగే డిష్ టివి కూడా ఇటీవలే తన ఆండ్రాయిడ్ టివి ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను తన కొత్త కస్టమర్ల కోసం 1,590 రూపాయలకు డిష్ NXT HD STB ని అందిస్తోంది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త కస్టమర్లు ఎయిర్‌టెల్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ను రూ. 1,300. ఇటీవల ఎయిర్‌టెల్ యొక్క హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్ ధర రూ. 1,800లుగా ఉండేది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వెబ్‌సైట్ ఎయిర్‌టెల్ ఎస్డీ సెట్-టాప్ బాక్స్ రూ.1,100 ధరలో మార్పును ఎక్కువ హైలైట్ చేస్తుంది.

సెట్-టాప్ బాక్స్‌ల ధర

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తమ ఎస్‌డి మరియు హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించడంతో పాటు డిటిహెచ్ ఆపరేటర్లు ఈ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ALT బాలాజీ వంటి వివిధ ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లను ఆఫర్ చేయడానికి ఆండ్రాయిడ్ ఆధారిత సెట్-టాప్ బాక్స్ ఎంపికలను వినియోగదారులకు అందిస్తున్నారు..

ఆండ్రాయిడ్ 9
 

టెలివిజన్ చూసే అనుభవాన్ని మార్చడానికి గత నెలలో ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా పని చేసే తన ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను తీసుకువచ్చింది. డిష్ టీవీ కూడా ఈ వారం ప్రారంభంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ మరియు గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ వంటి లక్షణాలతో ఆండ్రాయిడ్-పవర్డ్ డిష్ SMRT హబ్‌ను పరిచయం చేసింది.

4 లక్షల బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ RS.599 ప్రీపెయిడ్ ప్లాన్4 లక్షల బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ RS.599 ప్రీపెయిడ్ ప్లాన్

కొత్త ఆఫర్‌

ఎయిర్‌టెల్ ఇటీవలే తన ప్రస్తుత చందాదారుల కోసం కొత్త ఆఫర్‌ను విడుదల చేసింది. ఆఫర్ దీర్ఘకాలిక రీఛార్జిలో చెల్లుతుంది కానీ వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. తెలుగు వినియోగదారుల కోసం రూపొందించబడిన తెలుగు రీజినల్ SD ప్యాక్ ఈ కోవలోకి వస్తుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్రవేశపెట్టిన కొత్త ప్యాక్ ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో 4K STBకు పోటీగా డిష్ టీవీ కొత్త SMRT కిట్‌,ఆండ్రాయిడ్ టివి STBజియో 4K STBకు పోటీగా డిష్ టీవీ కొత్త SMRT కిట్‌,ఆండ్రాయిడ్ టివి STB

తెలుగు రీజినల్ SD ప్యాక్ వివరాలు

తెలుగు రీజినల్ SD ప్యాక్ వివరాలు

ఈ ప్యాక్ ఇప్పటికే ఉన్న ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ చందాదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ కింద వినియోగదారులు రూ .991 లకు 45 ఛానెల్‌లను పొందుతారు. ప్యాక్ చెల్లుబాటు కాలం 6 నెలలు. అంటే దీని ధర నెలకు రూ.165 కి వస్తుంది. ఇప్పుడు తెలుగు రీజినల్ SD ప్యాక్ కూడా 18 శాతం జీఎస్టీతో కలిపి దీని ధర 6 నెలలకు గాను రూ. 1,169లు. కాబట్టి దీని నెలవారీ ధర 195 రూపాయలకు తగ్గుతుంది. ఇందులో NCF ఛార్జీలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Digital TV Set-top Box Price Slashed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X