డబుల్ టాక్ టైమ్‌ బెనిఫిట్ తో ఎయిర్‌టెల్ Rs.65 ప్రీపెయిడ్ ప్లాన్

|

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన రూ.65 స్మార్ట్ రీఛార్జితో డబుల్ టాక్ టైమ్ బెనిఫిట్ ఇవ్వడం ప్రారంభించింది. టాక్ టైమ్ ప్లాన్‌లను తొలగించిన తరువాత ఎయిర్‌టెల్ గత ఏడాది విస్తృత శ్రేణి స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ రీఛార్జ్ షిప్ నుండి డేటా, టాక్ టైమ్ మరియు

రేట్ కట్టర్ ప్రయోజనాలతో 28 రోజుల నుండి 84 రోజుల వరకు నిర్దిష్ట కాలానికి వస్తున్నది.

డబుల్ టాక్ టైమ్
 

ఎయిర్‌టెల్ యొక్క రూ.65 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు డబుల్ టాక్ టైమ్ రూ.130ల బెనిఫిట్ను అందిస్తోంది. అయితే ఈ కొత్త ప్రయోజనం ప్రస్తుతానికి ఎంచుకున్న సర్కిల్‌లలో మాత్రమే వర్తిస్తుంది. రూ.65 ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు 200MB డేటా మరియు అన్ని వాయిస్ కాల్స్ నిమిషానికి 60 పైసల చొప్పున వసూలు చేయబడతాయి. ఈ ప్లాన్ అన్ని ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 28 రోజుల పాటు చెల్లుతాయి.

ఎయిర్‌టెల్ రూ.65 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్స్

ఎయిర్‌టెల్ రూ.65 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్స్

ఎయిర్‌టెల్ నుండి వస్తున్న రూ.65 ప్రీపెయిడ్ స్మార్ట్ రీఛార్జ్ ఇప్పుడు అస్సాం, బీహార్ మరియు జార్ఖండ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గడ్ , నార్త్ ఈస్ట్, ఒరిస్సా , రాజస్థాన్, యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు ఉత్తరాఖండ్ & పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని సర్కిల్‌లలో మాత్రమే డబుల్ టాక్ టైమ్ బెనిఫిట్‌తో వస్తుంది.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, కోల్‌కతా, ఢిల్లీ ఎన్‌సిఆర్, చెన్నై, ముంబై మరియు ఇతర ప్రాంతాలలో ఈ ప్లాన్ ఇప్పటికీ పాత ప్రయోజనాలతో వస్తుంది.

టాక్ టైమ్

పైన పేర్కొన్న సర్కిల్‌లలో రూ .65 ప్లాన్ ప్రస్తుతం రూ.130 టాక్ టైమ్ బెనిఫిట్, 200MB 4G / 3 G/ 2 G డేటాతో వస్తుంది. అన్ని వాయిస్ కాల్స్ నిమిషానికి 60 పైసలు వసూలు చేయబడతాయి. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. డబుల్ టాక్ టైమ్ బెనిఫిట్ చాలా వాయిస్ కాల్స్ చేసే వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డబుల్ టాక్ టైమ్ బెనిఫిట్ వర్తించని ఇతర సర్కిల్‌లలో ఎయిర్‌టెల్ నిమిషానికి 60 పైసల చొప్పున రూ .55 టాక్ టైమ్, 200 ఎంబి డేటాను అందిస్తోంది.

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు
 

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను సరిగ్గా ఏడాది క్రితం ప్రవేశపెట్టింది. సంస్థ యొక్క రూ .10, రూ .20, రూ .50 టాక్ టైమ్ ప్లాన్‌లను తొలగించిన వెంటనే ఈ ప్లాన్‌లు అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్‌టెల్ ‘మినిమమ్ రీఛార్జ్' అనే కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారుల అకౌంట్ యాక్టీవ్ లో ఉంచడానికి ప్రతి 28 రోజులకు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారు రీఛార్జ్ చేయకపోతే కంపెనీ ఏడు రోజుల తర్వాత ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌లను అందించడం ఆపివేస్తుంది. ప్రస్తుతం ప్లాన్ యొక్క గడువు ముగిసిన వెంటనే అవుట్‌గోయింగ్ వాయిస్ కాలింగ్ ఆపివేయబడుతుంది.

రూ.100 ల టాక్ టైమ్ ప్లాన్‌

ఎయిర్‌టెల్ రూ.100 ల టాక్ టైమ్ ప్లాన్‌ను మళ్ళి తిరిగి తీసుకువచ్చింది. అయితే ఈ ప్లాన్ ఇప్పుడు ఏ ప్రయోజనానికి ఉపయోగపడదు. ఉదాహరణకు ఎయిర్‌టెల్ నుండి స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ మీ అకౌంట్ యొక్క సర్వీస్ యాక్సిస్ ను నిర్దిష్ట కాలానికి పొడిగిస్తాయి. అయితే టాక్ టైమ్ ప్లాన్‌లు సర్వీస్ ప్రామాణికతతో అందించబడవు. కాబట్టి ఎటువంటి స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లేకుండా ఉన్న టాక్ టైమ్ ప్లాన్‌లు పనికిరానివిగా పరిగణించబడతాయి. ఎయిర్‌టెల్ యొక్క అపరిమిత కాంబో ప్లాన్‌లతో రీఛార్జ్ చేసే వినియోగదారులకు టాక్ టైమ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేయడానికి అదనంగా వెచ్చించవలసిన అవసరం లేదు.

యూజర్స్ బేస్

యూజర్స్ బేస్

భారతి ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ఇప్పుడు తమ చందాదారులను కోల్పోతున్నాయి. అయితే రెండు కంపెనీలు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లలో మార్పులు చేయడం ద్వారా వాటిని నిలుపుకోవాలని చూస్తున్నాయి. ఉదాహరణకు వోడాఫోన్ ఐడియా రూ.45 ల కొత్త యాక్టివ్ రీఛార్జిని ప్రవేశపెట్టింది. అలాగే కంపెనీ 28 రోజుల సర్వీస్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్‌తో రూ .20 టాక్ టైమ్ ప్లాన్‌ను కూడా తిరిగి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎయిర్టెల్ రూ .65 స్మార్ట్ రీఛార్జ్ యొక్క టాక్ టైమ్ ప్రయోజనాన్ని పెంచింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Offering Double Talk Time with Prepaid Smart Recharge of Rs.65

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X