Airtel Add-on Pack: డబుల్ డేటా ప్రయోజనంతో జియోకు ఝలక్...

|

ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ తన ప్రసిద్ధ రూ.98 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌పై ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తున్నది. అంటే ఇప్పుడు వినియోగదారులు 12GB వరకు హై స్పీడ్ డేటాను బ్రౌజ్ చేయగలుగుతున్నారు.

ఎయిర్ టెల్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌

ఎయిర్ టెల్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌

ఈ టెలికాం సంస్థ రూ .98 ప్యాక్‌తో తన వినియోగదారులకు గతంలో 6GBu డేటాను 28 రోజుల రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. ముఖ్యంగా కంపెనీ తన రూ .48 ధర గల ఇతర స్వతంత్ర డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను సవరించలేదు. ఇది వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటు కాలంతో మొత్తంగా 3GB వరకు హై స్పీడ్ డేటా ప్రయోజనంను అందిస్తుంది.

ఎయిర్టెల్ వర్క్ @ హోమ్ పోస్ట్ పెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ ఆఫర్లు

ఎయిర్టెల్ వర్క్ @ హోమ్ పోస్ట్ పెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ ఆఫర్లు

ప్రస్తుత సమయంలో ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వినియోగదారుల కోసం అదనంగా ఎయిర్‌టెల్ సంస్థ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో కూడా మార్పులను తీసుకువచ్చింది. అందులో భాగంగా సంస్థ యొక్క రూ.100 ధర గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు 15GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ను మొదట జనవరిలో ఆవిష్కరించారు. అయితే ఏప్రిల్‌లో కంపెనీ "ఎయిర్టెల్ వర్క్ @ హోమ్" ట్యాగ్ కింద దీనిని ప్రోత్సహించడం ప్రారంభించింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కంపెనీ రూ.200 ధర వద్ద మరొక డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులకు 35GB అదనపు డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
 

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లు ఆంధ్రప్రదేశ్, డీల్లీ / ఎన్‌సిఆర్ రీజియన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 349 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఇతర రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ యొక్క ప్లాన్‌లు రూ.399 వద్ద అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్లాన్‌లో 5GB రోల్‌ఓవర్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ తన రూ.349 ప్లాన్ చందాదారులకు Zee5, ఎయిర్‌టెల్ టివి ప్రీమియంను అదనంగా కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.399 ప్లాన్‌లో 40GB రోల్‌ఓవర్ డేటాతో పాటు రూ.349 ప్యాక్‌తో సమానమైన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తుండగా హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ కూడా అదనంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ మరికొన్ని పోస్ట్ పైడ్ ప్యాక్‌లు

ఎయిర్‌టెల్ మరికొన్ని పోస్ట్ పైడ్ ప్యాక్‌లు

భారతి ఎయిర్‌టెల్ రూ.749, రూ.999 మరియు రూ .1599 ధర వద్ద మరికొన్ని పోస్ట్ పైడ్ ప్యాక్‌లను అందిస్తుంది. ఇవి ఎక్కువగా అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో సహా ఇలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. రూ .799 ప్యాక్ 125 జీబీ రోల్‌ఓవర్ డేటాను అందించగా, రూ.999 ప్యాక్ 150 జీబీ రోల్ ఓవర్ డేటాను అందిస్తుంది. టాప్ టైర్డ్ రూ. 1599 ప్యాక్ యూజర్లు 200 ISD నిమిషాలతో పాటు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లపై 10% డిస్కౌంట్‌తో పాటు అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ సంస్థ అందిస్తున్న రూ.179, రూ.279 ప్రారంభ ధర ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే ఇవి వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్, డేటా వంటి ముఖ్యమైన ప్రయోజనాలతో పాటుగా జీవిత బీమా కవర్ ప్రయోజనంను కూడా అందిస్తుంది. రూ.179 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2GB డేటా, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, 300SMS‌లు మరియు భారతి ఆక్సా లైఫ్ యొక్క రూ.2 లక్షల జీవిత బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వినియోగదారులు అపరిమిత హలో ట్యూన్‌లను సెట్ చేయడానికి మరియు వింక్ మ్యూజిక్‌లో అపరిమిత సంగీతాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్‌ రెండు జీవిత బీమా పథకాలతో పాటు OTT చందాలను కూడా ఉచితంగా అందిస్తుంది. కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఉత్తమమైన ప్లాన్ ఇదే కావడం మరొక విషయం. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS లు, అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రూ.129 విలువైన ఒక నెల అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సభ్యత్వం, ఉచిత హలొటూన్స్, వింక్ మ్యూజిక్ సభ్యత్వం, షా అకాడమీ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్ట్‌టాగ్‌లో రూ.150 క్యాష్‌బ్యాక్ మరియు మీ ఫోన్ కోసం యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రయోజనాలను ఎయిర్‌టెల్ థాంక్స్ మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు.

రిలయన్స్ జియో యాడ్-ఆన్ ప్యాక్‌

రిలయన్స్ జియో యాడ్-ఆన్ ప్యాక్‌

రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ వంటి ఇతర సంస్థలు కూడా దాని వినియోగదారులకు ఇలాంటి డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో సంస్థ రూ.101 ధర గల యాడ్-ఆన్ ప్యాక్‌తో వినియోగదారులకు 12GB హై స్పీడ్ డేటాతో పాటు 1000 నిమిషాల నాన్ జియో వాయిస్ కాలింగ్‌ ప్రయోజాలను అందిస్తుంది. రిలయన్స్ జియో యొక్క రూ.101 యాడ్-ఆన్ ప్యాక్ యూజర్ యొక్క ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకు చెల్లుతుంది. ఇంకా జియో మే రెండవ వారంలో ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని కొత్తగా కొన్ని డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా ఆవిష్కరించింది. సవరించిన కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లలో రూ.151 డేటా యాడ్-ఆన్ ప్యాక్, రూ.201 మరియు రూ .251 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు కూడా ఉన్నాయి.

వోడాఫోన్ యాడ్-ఆన్ ప్యాక్‌

వోడాఫోన్ యాడ్-ఆన్ ప్యాక్‌

వోడాఫోన్ సంస్థ కూడా తన వినియోగదారులకు రూ.98 ధర వద్ద ఇటువంటి డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను అందిస్తుంది. కాకపోతే ఇది మిగతా వాటి కంటే తక్కువ డేటాను అందిస్తోంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి కేవలం 6GB హై స్పీడ్ డేటాను బ్రాజ్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది. వోడాఫోన్ తన ప్రీపెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్ లలో తన ప్రత్యర్థులు ఎయిర్‌టెల్ మరియు జియోతో పోలిస్తే ఇది కాస్త వెనుకబడి ఉంది అని చెప్పాలి.

Best Mobiles in India

English summary
Airtel Rs 98 Data Pack Plan Offers Double Data Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X