పని ఒత్తిడి తట్టుకోలేక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్

Posted By: Super

పని ఒత్తిడి తట్టుకోలేక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్

బెంగళూరు: పోలీసుల వివరాల ప్రకారం 38 సంవత్సరాల వయసు కలిగినటువంటి సాప్ట్‌వేర్ ఇంజనీర్ ప్రభాకర్ హెచ్‌యస్‌ఆర్ లేఅవుట్‌ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం తెల్లవారు జామున ఎనిమిది గంటల ప్రాంతంలో కొందనహాళ్శి చెరువులో శవం కనిపించింది. శవాన్ని చూసినటువంటి వారు ఆ శవం ప్రభాకర్‌దేనని గుర్తించి ప్రభాకర్ అర్దరాత్రి నుండే కనపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

దాంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రబాకర్ ఇంటికి వెళ్శి ఈ విషయాన్ని తెలియజేసి అతని ఇంటిలో విచారణ ప్రారంభించారు. విచారణలో తేలింది ఏమిటంటే ప్రబాకర్ ఏవో ఫ్రోఫెషనల్ కంప్లైంట్స్‌తో భాద పడుతున్నట్లు వారు గుర్తించడం జరిగింది. ప్రబాకర్ బెంగళూరు నగరంలోని హాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రబాకర్ ఆత్మహాత్య చేసుకోవడానికి ముందే తన ఇంటిలో బాగా ప్రిపేర్ అయినట్లు ఉన్నాడని పోలీసులు వెల్లిడించారు.

హెచ్‌యస్‌ఆర్ లేఅవుట్ పోలీసుల కధనం ప్రకారం ప్రభాకర్ కొందనహాళ్శి చెరువు సమీపానికి దాదాపు ఒంటి గంట ఆప్రాంతంలోనే వెళ్శి ఉండవచ్చునని అంటున్నారు. హానురప్పా(వాచ్‌మెన్) చెప్పిన దాని బట్టి చూస్తుంటే, ప్రభాకర్ ఒంటి గంట సమయంలో నడుచుకుంటూ చెరువు వైపుకి రక్తంతో తడిచినటువంటి చేతితో వెళ్తుండగా వాచ్‌మెన్ ప్రభాకర్‌తో మీచేతికి ఏమైందని అడడగా ప్రభాకర్ తమిళంలో ఏదో చెప్పాడని సమాచారం.

దాంతో అనుమానం వచ్చినటువంటి హానురప్పా తనతో పాటు ఉన్నటువంటి సురేష్ కుమార్‌ని నిద్రలేపడం జరిగింది. ఇద్దరూ కలిసి ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా చివరకు ప్రభాకర్ శవమై చెరువులో కనిపించగా వారు పోలీస్ స్ఠేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్నటువంటి హాయసాలా పోలీసులు కూడా ప్రభాకర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. బాడీని విక్టోరియా వద్దకు తరలించగా ప్రభాకర్ తల్లిదండ్రులు జయరామ్, శాంత చెన్నై నుండి రావడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot