రోజుకు 3GB డేటాతో RS.187 ప్రీపెయిడ్ STV ప్లాన్‌ను సవరించిన BSNL

|

భారత్ సాంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) గత సంవత్సరం నుండి మరింత ఎక్కువ మంది చందాదారులను ఆకర్షించడానికి ప్రత్యేక పంథాను అనుసరిస్తోంది. ఈ టెలికాం ఆపరేటర్ ఆర్థిక సమస్సలు ఎదుర్కొంటున్న సమయంలో టెల్కో సహాయం పొందగల ఏకైక మార్గం కొత్త చందాదారులను చేర్చడం. అలా చేయడానికి బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు (ఎస్టివి) ను సవరించింది మరియు కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ చాలా ఆఫర్లను ప్రవేశపెట్టింది.

బిఎస్ఎన్ఎల్
 

బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అన్ని ప్లాన్లు ప్రీపెయిడ్లో వర్తిస్తాయి. అవి చందాదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడు ఒక కొత్త ఎత్తుగడలో బిఎస్ఎన్ఎల్ కొన్ని ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్లకు కొన్ని సవరణలు చేసింది. వీటిలో రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్, రూ .187 ఎస్టివి ప్లాన్ కూడా ఉన్నాయి. సవరణ చేసిన తరువాత ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

బిఎస్ఎన్ఎల్ సవరించిన మొట్టమొదటి ప్లాన్ రూ .185 ప్రీపెయిడ్ ప్లాన్‌. కొంతకాలం క్రితం బిఎస్ఎన్ఎల్ రూ .186 PVని తన పోర్టుఫోలియో నుండి తొలగించింది.టెల్కో మళ్ళి ఇప్పుడు ఈ ప్లాన్ ను తిరిగి ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను FUP వేగంతో అందిస్తోంది. సవరించిన తరువాత ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తోంది. ఇతర ప్రయోజనాలు అలాగే ఉన్నాయి. ఇందులో ఏ నెట్‌వర్క్‌కైన రోజుకు 250 నిమిషాలు ఉచితంగా కాల్ చేయవచ్చు మరియు రోజుకు 100 SMS ఉంటాయి. ఈ ప్లాన్ చెల్లుబాటు సమయం 28 రోజులు మాత్రమే.

రూ.187 STV ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

రూ.187 STV ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ఈ కొత్త సవరణలో బిఎస్ఎన్ఎల్ రూ.187 ఎస్టీవీ కి కూడా ఇలాంటి మార్పులు ఇవ్వబడ్డాయి. ఈ ప్లాన్ ముందు వినియోగదారులకు రోజుకు 2 జిబి డేటాను అందించేది. కాని ఇప్పుడు రోజుకు 3 జిబి డేటాను FUP వేగంతో అందిస్తోంది FUP తరువాత దీని స్పీడ్ 40 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌లోని ఇతర ప్రయోజనాలు ఏ నెట్‌వర్క్‌కు రోజుకు 250 నిమిషాల అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు. ఈ ప్లాన్ చెల్లుబాటు సమయం 28 రోజులు మాత్రమే.

ఇతర ప్రీపెయిడ్ వోచర్లు
 

ఇతర ప్రీపెయిడ్ వోచర్లు

బిఎస్ఎన్ఎల్ ప్లాన్ సవరణ జాబితాలో రూ.153 ప్రీపెయిడ్ వోచర్ కూడా ఉంది. ఇంతకుముందు ఇది 28 రోజులకు రూ .103 టాక్ వాల్యూతో వచ్చేది. కానీ ఇప్పుడు ఇది అపరిమిత కాల్‌లు మఱియు రోజుకు 1.5 GB డేటాను 28 రోజులకు అందిస్తుంది. ఈ ప్లాన్ డేటా FUP తరువాత వేగం 40 Kbpsగా ఉంటుంది.

ఎస్‌టివి

రూ .192, రూ.118 ఎస్‌టివిలతో సహా ఇతర ఎస్‌టివిలు కూడా సవరించబడ్డాయి. రూ. 192 ఎస్‌టివి ఇప్పుడు రోజుకు 2 జిబి డేటాకు బదులుగా రోజుకు 3 జిబి డేటాను, ఏ నెట్‌వర్క్‌కైనా 250 నిమిషాల కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు ఉచిత పిఆర్‌బిటితో పాటు రోజుకు ఒక నేషనల్ డిస్కౌంట్ డీల్ లేదా కూపన్‌లను అందిస్తుంది. అదేవిధంగా రూ .118 ఎస్‌టివి రోజుకు 0.5 జిబి డేటాను 40 కెబిపిఎస్ ఆఫ్టర్-ఎఫ్‌యుపి స్పీడ్‌తో మరియు రోజుకు 250 నిమిషాల కాలింగ్ తో 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్

చివరగా బిఎస్ఎన్ఎల్ మొదటిసారి ప్రవేశపెట్టిన రీఛార్జిలను కూడా కొద్దిగా మార్పులు చేసారు. వీటిలో 24 రోజుల చెల్లుబాటు కోసం రోజుకు 1GB డేటాను అందించే రూ .106 FRC మరియు రూ.107 FRC ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Revised Rs 187 Prepaid STV Plan offers 3GB Daily Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X