OnePlus 8 5G Sale:రూ.2000 తగ్గింపుతో & గొప్ప ఆఫర్లతో నేడే మొదటి సేల్స్...

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ గత నెల ఏప్రిల్ 14న రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో చౌకైన వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో ఈ రోజు స్పెషల్ సేల్స్ కింద అమ్మకానికి ఉంచింది.

వన్‌ప్లస్ 8

వన్‌ప్లస్ 8

వన్‌ప్లస్ సంస్థ తన వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క బహిరంగ సేల్ ను ఆలస్యం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే సంస్థ ఇప్పుడు వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మొదటిసారిగా అమ్మకానికి ఉంచింది. వన్‌ప్లస్ 8 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14 న లాంచ్ అయింది. ఈ రోజు అంటే మే 29 నుండి భారతదేశంలో దీని యొక్క సేల్స్ మొదలుకానున్నాయి. JioFiber బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల డేటా ఆఫర్స్ ఇవే...

వన్‌ప్లస్ 8 ఫోన్ సేల్స్

వన్‌ప్లస్ 8 ఫోన్ సేల్స్

వన్‌ప్లస్ తన అభిమానుల కోసం మే 18 న మొదటిసారిగా ప్రారంభ సేల్స్ ను కూడా నిర్వహించింది. కాకపోతే వీటి యొక్క అమ్మకాలు ఫ్లాష్ సేల్స్ ద్వారా నిర్వహించబడ్డాయి కావున ఎక్కువ మంది ఆర్డర్ చేయలేక పోయారు. ఆ సమయంలో దీనిని ఆర్డర్‌ చేసిన వారికి మే 26 నాటికి ఫోన్ ను అందించారు. దేశంలో లాక్‌డౌన్ ఇప్పటికీ అమలులో ఉన్న కారణంగా రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్నవారు ఇప్పటికి కూడా వన్‌ప్లస్8 5G ను కొనుగోలు చేయవచో లేదో స్పష్టంగా తెలీదు. వన్‌ప్లస్ 8 ప్రో యొక్క అమ్మకాలు ఈ సంవత్సరంలోనే జరుగుతూ ఉండటంతో వన్‌ప్లస్ భారతదేశంలో ఈ అమ్మకాలతో చౌకైన ధరలకు మార్గం సుగమం చేస్తోంది. Umang app యాప్ ద్వారా ఈ ప్రభుత్వ సేవలను కూడా పూర్తి చేయవచ్చు!!!!

వన్‌ప్లస్ 8 5G ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 5G ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులో 6Gb ర్యామ్ +128GB స్టోరేజ్ గల బేస్ మోడల్ యొక్క ధర రూ.41,999. అలాగే 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.44,999. చివరిగా 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ గల హై వేరియంట్ యొక్క ధర 49,999 రూపాయలు.

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ఒనిక్స్ బ్లాక్, హిమనదీయ గ్రీన్ మరియు ఇంటర్స్టెల్లార్ గ్లో వంటి మూడు వేర్వేరు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ అమ్మకంలో భాగంగా SBI కార్డ్ హోల్డర్లు రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే దీనిని 12 నెలల వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపిక ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

వన్‌ప్లస్ 8 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ లో 6.55-అంగుళాల ఫుల్ HD + ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది అడ్రినో 650 GPU మరియు స్నాప్‌డ్రాగన్ 865 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఇది మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలతో వస్తుంది. స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 10 ద్వారా రన్ అవుతుంది. అలాగే ఇది UFS 3.0 స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది. ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటుగా 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా జత చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

వన్‌ప్లస్ 8 5G ఫీచర్స్

వన్‌ప్లస్ 8 5G ఫీచర్స్

వన్‌ప్లస్ యొక్క సరికొత్త 8 5G ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో రన్ అవుతూ అడ్రినో 650 GPU తో జత చేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు వార్ప్ ఛార్జ్ 30T (30W ఫాస్ట్ ఛార్జింగ్) కు మద్దతుతో వస్తాయి. ప్రో వేరియంట్లో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హాప్టిక్ వైబ్రేషన్ 2.0 సపోర్ట్ కూడా ఉంది. వన్‌ప్లస్ 8 ఆండ్రాయిడ్ 10 తో ఆక్సిజన్‌ఓస్‌తో రన్ అవుతుంది. ఇవి డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి శబ్దం రద్దుతో పాటు డాల్బీ అట్మోస్‌కు మద్దతును ఇస్తాయి. ఈ ఫోన్‌ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వన్‌ప్లస్ 8 5G కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 5G కెమెరా సెట్ అప్

కెమెరాల విషయానికొస్తే వన్‌ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను f / 1.75 ఎపర్చరు మరియు 0.8 μm పిక్సెల్ పరిమాణంతో కలిగి ఉంది. ఈ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) రెండింటికి మద్దతు ఇస్తుంది. ఇది 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో జత చేయబడి ఉంటుంది. ఈ సెటప్‌లో 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. దీనికి డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ సహాయపడుతుంది. సెటప్ PDAF మరియు కాంట్రాస్ట్-బేస్డ్ ఆటో ఫోకస్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ f / 2.45 ఎపర్చరు మరియు ఫిక్స్‌డ్ ఫోకస్ మరియు EIS తో ఉంటుంది.

Best Mobiles in India

English summary
OnePlus 8 5G Special Sale Start Today at 12PM via Amazon: Price, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X