ఫ్లిప్‌కార్ట్ ద్వారా రియల్‌మి 5 సేల్స్:జిగేల్ మనిపించే ఆఫర్స్

|

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను గత వారం ఇండియాలో రిలీజ్ అయింది.రియల్‌మి సంస్థ రియల్‌మి5 స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలను మొదలు పెట్టింది. రియల్‌మి 5 యొక్క అమ్మకాల మొదటి బ్యాచ్ మొత్తం కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైందని రియల్‌మి సంస్థ వెల్లడించింది. సుమారు 1,20,000 యూనిట్లకు పైగా ఫోన్‌లను తన మొదటి బ్యాచ్ లో విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. రియల్‌మి 5 యొక్క మొదట బ్యాచ్ అమ్మకాలు ఆగస్టు 27 న ఇండియాలో మొదలిపెట్టింది.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రియల్‌మి 5 సేల్స్:జిగేల్ మనిపించే ఆఫర్స్

 

ఇప్పుడు రియల్‌మి తన తదుపరి రియల్‌మి 5 యొక్క అమ్మకాలు ఆగస్టు 30 న జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఆగష్టు 30న జరగబోయే అమ్మకాలలో రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ మీద కంపెని అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది. ఆఫర్ల యొక్క అన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

రియల్‌మి 5 ధరల వివరాలు

రియల్‌మి 5 ధరల వివరాలు

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా ఆగస్టు 30న మధ్యాహ్నం 12:00 గంటలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 5ని కూడా త్వరలో ఆఫ్‌లైన్ దుకాణాల ద్వారా విక్రయించబోతున్నట్లు రియల్‌మి సంస్థ తెలిపింది. ధర వివరాల ప్రకారం రియల్‌మి యొక్క బేస్ వేరియంట్ 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ ధర 9,999 రూపాయలు. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు. అలాగే ఇందులో టాప్ వేరియంట్ 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర 11,999 రూపాయలు.

ఆఫర్స్ వివరాలు

ఆఫర్స్ వివరాలు

రియల్‌మి 5 యొక్క సేల్ ఆఫర్ల విషయంలో రిలయన్స్ జియో 7,000 రూపాయల విలువైన ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. మొబిక్‌విక్‌ యొక్క కొనుగోలుపై 10 శాతం సూపర్‌క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు. చివరగా కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం Paytm UPI ద్వారా కొనుగోలు చేసినచో 2,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రియల్‌మి సంస్థ ఈ ఫోన్‌ను క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్‌తో కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే విడుదల చేసింది.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్ ఓఎస్ 6.0తో రన్ అవుతుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.5-అంగుళాల భారీ డిస్ప్లే ఉంది. ప్యానెల్ 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత రన్ అవుతుంది. ఇది 11nm ప్రాసెస్‌లో తయారు చేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 256జీబీ వరకు విస్తరించే ఎంపిక కూడా ఉంది.

కెమెరాలు

కెమెరాలు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి ఫోన్ యొక్క క్వాడ్ రియర్ కెమెరాలు. ఈ సెటప్‌లో f/ 1.8 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. రెండవది 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు చివరగా మూడవది డీప్ మరియు స్థూల షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు వెనుక వైపు ఉన్నాయి. ఇందులో ముందు వైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఇది AI బ్యూటీ మోడ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000 mAh బ్యాటరీని అందిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 4G VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, a 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme 5 Next Sale on August 30 via Flipkart: Price and Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X