రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఆశక్తికరమైన విషయాలు

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మి 2019 లో ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులలో మూడవ స్థానంలో ఉన్నది. ఈ కంపెనీ 2019 లో అనేక ధరల విభాగాలలో మార్కెట్లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

రియల్‌మి

ఇప్పుడు 2020 సంవత్సరం రెండవ నెలలో రియల్‌మి సంస్థ తన తదుపరి స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 లో రియల్‌మి సంస్థ కొన్ని డివైస్లను లాంచ్ చేయనుంది. గత నివేదికల ప్రకారం రియల్‌మి C3 తో సహా కొన్ని రియల్‌మి డివైస్లను లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. రియల్‌మి యొక్క C సిరీస్‌కు సంబంధించి కొన్ని గణాంకాలను ట్విటర్ ద్వారా విడుదల చేసింది.

 

 

2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

రియల్‌మి C సిరీస్‌ సేల్స్

రియల్‌మి C సిరీస్‌ సేల్స్

ట్విటర్ లో రియల్‌మి సంస్థ చేసిన ట్వీట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10.2 మిలియన్ C సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ నెంబర్ ఎంట్రీ లెవల్ విభాగంలో విజయం సాధించినట్లు సూచిస్తోంది అని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు రియల్‌మి సంస్థ దాని C సిరీస్ ఫోన్ల యొక్క మెయిన్ ఫీచర్స్ లను కూడా వివరిస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. రియల్‌మి C3 ను లాంచ్ చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతున్న సమయంలోనే ఈ ట్వీట్ చేసింది.

 

7రోజుల ముందు టీవీషోలను చూసే సర్వీసుతో టాటా స్కై బింగే +7రోజుల ముందు టీవీషోలను చూసే సర్వీసుతో టాటా స్కై బింగే +

లీక్ అయిన రియల్‌మి C3 స్పెసిఫికేషన్స్

లీక్ అయిన రియల్‌మి C3 స్పెసిఫికేషన్స్

పరిశ్రమలో లీక్ అయిన సమాచారం ప్రకారం రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ 5,000 mAH బ్యాటరీతో భారత మార్కెట్లో విడుదల కానున్నది. ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన రియల్‌మి C2 కన్నా 20 శాతం పెద్దదిగా ఉంది. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో అనుదుబాటులోకి రానున్నది. ఇది 2019 మోడల్ మాదిరిగానే రాబోయే స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది.

 

 

4G, ఆండ్రాయిడ్ ఫీచర్లతో లాంచ్ అయిన Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్4G, ఆండ్రాయిడ్ ఫీచర్లతో లాంచ్ అయిన Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్

రియల్‌మి C3

ఇతర మార్కెట్లలో రియల్‌మి C3 మోడల్ నంబర్ RMX2020 తో గుర్తించబడింది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అమర్చబడి ఉంది. ప్యాకేజీలో భాగంగా ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7తో పాటు 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. ఇది రూ.6,000 నుండి 7,000 ల లోపు ధరతో ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియాలో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

 

 

2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

రియల్‌మి 5ప్రో ధర తగ్గింపు

రియల్‌మి 5ప్రో ధర తగ్గింపు

ఇండియాలో ఆరు నెలలకు ముందు రిలీజ్ అయిన రియల్‌మి 5ప్రో మీద ఇప్పుడు శాశ్వత ధరల తగ్గింపు లభించింది. రియల్‌మి 5ప్రో ఇప్పుడు భారతీయ మార్కెట్లో రూ.12,999 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. రియల్‌మి 5ప్రోను రియల్‌మి 5 తో పాటు ఆగస్టు 2019 లో రూ.13,999 ధర వద్ద లాంచ్ చేశారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC, 48MP సోనీ IMX586 ప్రైమరీ లెన్స్, 4000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ లను అందిస్తుంది. రియల్‌మి 5ప్రో యొక్క కొత్త ధరలు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రభావవంతంగా ఉన్నాయి. రియల్‌మి 5ప్రోను 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

 

 

Poco X2 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఇవే ఫీచర్స్...Poco X2 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఇవే ఫీచర్స్...

రియల్‌మి 5ప్రో కొత్త ధరల వివరాలు

రియల్‌మి 5ప్రో కొత్త ధరల వివరాలు

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ----- రూ.12,999

6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ -------- రూ.13,999

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ------- రూ.15,999

 

Best Mobiles in India

English summary
Realme5 Pro Price Slash, Realme C3 Features Leak, Realme C Series Record Sales: Daily News Wrap

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X