అంచనాల్లో ఆశావాహులు..?

By Super
|
 What to expect at Apple WWDC 2012?


ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఆరాధికులు ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆపిల్ వరల్డ్ వైడ్ డవలెపర్స్ కాన్ఫిరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2012, నేటి నంచి శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రారంభంకానుంది. ఐదు రోజులు పాటు నిర్వహించే ఈ సదస్సులో ఆపిల్ భవిష్యత్ ప్రణాళికలతో పాటు నూతన ఆవిష్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించనున్నారు. సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి ఆపిల్‌కు గట్టి పోటీ ఎదురువుతున్న తరుణంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఏ అంశాలు ప్రస్తావనుకు రానున్నాయి..?. వ్యూహ..ప్రతివ్యూహాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయ్?, కొత్త ఆవిష్కరణలు తెరపైకి వచ్చే అవకాశముందా..? ఈ రకమైన ప్రశ్నలు విశ్లేషకులతో పాటు ఆపిల్ అభిమానులను ఉత్కంఠకులోను చేస్తున్నాయి. జూన్ 2010లో నిర్వహించిన డబ్ల్యూడబ్ల్యూడీసీ సదస్సులో ఆపిల్ ‘ఐవోస్4’ను ఆవిష్కరించింది. 2011 జూన్‌లో నిర్వహించిన డబ్ల్యూడబ్ల్యూడీసీ సదస్సులో ‘ఐవోస్5’ను విడుదల చేసింది. ఈ ఏడాది నిర్వహిస్తున్న సదస్సులో ‘ఐవోస్6’ను ప్రవేశఫెట్టనుంది.

డబ్ల్యూడబ్ల్యూడీసీ, 2012 ద్వారా ఈ అంశాలను ఆశించవచ్చు:

ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్:

ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్ 6’ను ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‍‌కు అనుసంధానం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఈ ప్రక్రియ వల్ల యూజర్లు సమాజం పట్ల ధృడమైన బంధాన్ని ఏర్పరుచుకోగలుగుతారు.

సరికొత్త మ్యాప్ అప్లికేషన్:

ఈ వేదిక ద్వారా ఆపిల్ సరికొత్త మ్యాపింగ్ అప్లికేషన్‌లను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి లీకైన పలు చిత్రాలు ఆ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ సరికొత్త మ్యాపింగ్ అప్లికేషన్ సౌలభ్యతతో పటాలను ‘3డి’రూపంలో వీక్షించవచ్చు.

సిరీ ఆన్ ఐప్యాడ్:

ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్ 6’ సిరి వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను రానున్న ఐప్యాడ్ వర్షన్‌లలో పొందుపరచనున్నారు. మరిన్ని అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X