యూజర్లకు జియో మరో బంఫరాఫర్

Written By:

రిలయన్స్ జియో మరోసారి కదం తొక్కింది.. సరికొత్త ప్లాన్లకు తెరలేపింది. సంచలన ఆఫర్లను వినియోగదారులకు ముుందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో ఇప్పుడు వీటికే భారీ డిమాండ్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డేటా కార్డు, డోంగిల్

ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది.

జియోఫై రూటర్ పొందడానికి

అయితే జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి.

2010 రూపాయల విలువైన 4జీ డేటాతో

కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది.

408 రూపాయలతో తొలి రీఛార్జ్

ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేయించుకుంటే చాలు

1,999కే జియోఫై

1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s new plans offer 100% cashback on JioFi on exchange of old dongle, datacard, router read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot