ఆ ప్రకటనలు వద్దంటున్న ఫేస్ బుక్! ఇంతకీ ఏంటా ప్రకటనలు?

By: Madhavi Lagishetty

బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ యాడ్స్ ను ఫేస్ బుక్ తన వేదికపై నిషేధించాలని భావిస్తోంది. ఇన్ స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్ వర్క్ , మెసెంజర్లలోనూ వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించింది. తప్పుదోవపట్టించే ఫైనాన్షియల్ ప్రొడక్టులను ప్రోత్సహించే యాడ్స్ నిషేదించినట్లు ఫేస్ బుక్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఆ ప్రకటనలు వద్దంటున్న ఫేస్ బుక్! ఇంతకీ ఏంటా ప్రకటనలు?

అయితే నూతన ప్రోడక్టుల గురించి ప్రజలు ఫేస్‌బుక్‌ యాడ్స్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కొనసాగుతుందని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. ఇది ico, క్రిప్టోకరెన్సీ, ఇతర బైనరీ ఆప్షన్స్ యాడ్స్ సంఖ్యను కలిగి ఉన్నట్లు తెలిపింది.

క్రిప్టోకరెన్సీ మాదిరిగా తప్పుదోవ పట్టించే యాడ్స్ నిషేదించడంలో ఫేస్ బుక్ విధానం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ప్రకటనలు ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫాంలపై నుంచి నిషేధిస్తున్నామని తెలిపారు. ఫేస్‌బుక్‌ ప్రకటనలపై ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నివేదించవచ్చని కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఫేస్‌బుక్‌లో తావుండదని కంపెనీ స్పష్టం చేసింది.

ఇండియాలో బెస్ట్ యాక్షన్ కెమెరాలు ఇవే! ధర కూడా తక్కువే!

ఇక అనవసర ప్రకటనలను అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్లో క్లిక్ చేస్తే...వాటిని సులభంగా నిషేదించవచ్చు. ఫేస్ బుక్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు యూజర్లకు హెచ్చరికలా ఉండాలని...ఏదైనా క్రిప్టోకరెన్సీ కి సంబంధించిన యాడ్ కనిపించినట్లయితే...దానిని అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్లో క్లిక్ చేయండి. అంతే యాడ్ కనిపించకుండా పోతుంది.

Read more about:
English summary
Facebook is planning to ban all the advertisements for Cryptocurrencies.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot