ఫేస్‌బుక్‌ నుంచి కొత్త యాప్ !

విండోస్ మరియు మాక్ కోసం వర్క్ ప్లేస్ చాట్ డెస్క్‌టాప్ యాప్‌ను లాంచ్ చేసిన ఫేస్‌బుక్‌

By Madhavi Lagishetty
|

సరికొత్త ఆవిష్కరణలతో యూజర్లు ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌..తాజాగా వర్క్ ప్లేస్ చాట్ అనబడే డెస్క్‌టాప్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇది డెస్క్‌టాప్ యాప్ విండోస్ మరియు మాక్ రెండింటికి అనుకూలంగా ఉండటంతోపాటు...స్క్రీన్ షేరింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

Facebook Workplace Chat desktop app launched for Windows and Mac

టెక్ క్రంచ్ రిపోర్ట్ ప్రకారం.. డెస్క్‌టాప్ యాప్ మీ మెసేజ్ లను సేకరిస్తుంది. అంతేకాదు టెక్ట్స్ సెర్చ్ అందించే డ్యాష్ బోర్డు కూడా ఉంటుంది. వీడియోలు, ఫోటోలు, వీడియో క్లిప్పులు, ఎమోజీలు మరియు గిఫ్ ల కోసం షేరింగ్ ఆప్షన్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. విండోస్ 7 పై నడుస్తున్న సిస్టమ్స్ ను మరియు మాక్ ఓఎస్ 10.9పై రన్ అవుతున్న సిస్టమ్స్ లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. విండోస్ మరియు మాక్ ఓఎస్ యొక్క ప్రస్తుత వెర్షన్లో అమలవుతున్న సిస్టమ్స్ కు ఈ డెస్క్‌టాప్ యాప్ సపోర్ట్ చేయదు.

ఫేస్‌బుక్‌ నుంచి ఈ డెస్క్‌టాప్ యాప్ ద్వారా గ్రూప్ సభ్యులతో చాట్ తోపాటు కలిసి పనిచేయడానికి స్లాక్ లాగానే ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్‌ యూజర్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై పర్సనల్ అకౌంట్ కలిగి ఉన్నప్పుడు, వర్క్ ప్లేస్ చాట్ ఒక ప్రొఫెషల్ స్పేస్ లాగా ఉపయోగపడుతుంది. కో-వర్కర్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడానికి మరియు కంపెనీకి సంబంధించిన మెసేజ్ ను షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఫ్రీ అంటూనే అదనపు ఛార్జీల బాదుడు షురూ చేసిన జియోఫ్రీ అంటూనే అదనపు ఛార్జీల బాదుడు షురూ చేసిన జియో

ఆఫీస్ చాట్ యొక్క డెస్క్‌టాప్ యాప్ నోటిఫికేషన్ బటన్ను కలిగి ఉంది. ఇతర చాట్ యాప్స్ కు సిమిలర్గా ఉంటుంది. షేరింగ్ ఫీచర్స్ తోపాటు వాయిస్ , వీడియో కాలింగ్ వంటి వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు 360డిగ్రీ వీడియోలను ప్రత్యక్ష ప్రసారం చేసే కెపాటిసి ఉంటుంది.

వర్క్ ప్లేస్ ఫ్లాట్ ఫాం ఇఫ్పుడు ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న యూజర్లకు ప్రీమియం వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ స్క్రీన్ షేరింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంప్లాయిస్ చాట్ డెస్క్‌టాప్ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్‌ ఎంప్లాయిస్ ఇంటర్నల్ గా ఉపయోగించుకోవచ్చు.

యూజర్లకు తమకు కావాల్సిన ఫీచర్లు ఉన్నవాటిలో ఇది ఒకటి. యూజర్ల అభిరుచికి అనుగుణంగా దీన్ని క్రియేట్ చేశాము. డెస్క్ టాప్ యాప్ బీటా వెర్షన్లో ఉంది. రోల్ అవుట్ను విస్త్రుతపరిచేందుకు కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ కోరుతున్నామని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి వెనెస్సాచాన్ తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Workplace Chat desktop app has been launched for the Windows and Mac systems.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X