ఫేస్ రికగ్నైజ్ ద్వారా మీ ఫేస్‌బుక్‌ అకౌంట్ అన్లాక్ చేయోచ్చు!

త్వరలోనే ఫేస్‌బుక్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది

By Madhavi Lagishetty
|

మీ ఫేస్‌బుక్‌ అకౌంట్ పాస్‌వర్డ్‌ మర్చిపోయారా? ఎంతకూ గుర్తురావడం లేదా? డోంట్ వర్రీ. మీ అకౌంట్ను మళ్లీ ఒపెన్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరూ తెలుసుకోండి.

You could soon unlock your Facebook account using facial recognition feature

ఫేస్‌బుక్‌ అకౌంట్ పాస్‌వర్డ్‌ మర్చిపోయినవారికి గుడ్ న్యూస్. పాస్‌వర్డ్‌ను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ ఈజీ మార్గాన్ని అందిస్తోంది. వేరే అకౌంట్ ద్వారా మీ అసలు అకౌంట్ను ఒపెన్ చేసేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తోంది. టెక్ క్రంచ్ మరియు మ్యాట్ నవారా ద్వారా పోస్ట్ చేసిన స్క్రీన్షాట్తో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఒక అకౌంట్ను అన్లాక్ చేసేందుకు ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఫేస్ రికగ్నైజ్ ఫీచర్ ఇప్పటికే లాగిన్ చేసిన డివైస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ను సెలక్ట్ చేసుకున్న యూజర్ల ద్వారా మాత్రమే టెస్ట్ చేయబడింది. ఈ ఫీచర్ నమ్మదగినదిగా ఉన్నట్లయితే...త్వరలోనే ఫేస్‌బుక్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఫేస్‌బుక్‌ స్కానింగ్ ఫీచర్ ఒక అకౌంట్ను అన్లాక్ చేయడానికి రియబుల్గా ఉంటుంది. లేదంటే హ్యాకర్లు యూజర్స్ పిక్చర్స్ ఉపయోగించి ఈజీగా హ్యాక్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది.

ఈ Photoshop skills మీకు తెలుసా..?ఈ Photoshop skills మీకు తెలుసా..?

అయితే యూజర్స్ ముఖాన్ని ఫోన్ ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. దీంతో ఫేస్‌బుక్‌ యాప్ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ప్రొఫైల్లో అప్లోడ్ చేయబడిన యూజర్స్ ట్యాగ్ పిక్చర్స్ మరియు వీడియోలతో కంపైర్ చేయోచ్చు. మ్యాచ్ అయినట్లయితే...అప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్ ఒపెన్ అవుతుంది.

ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీకి ఫేస్‌బుక్‌ కొత్తదేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఫోటోల్లో టాగింగ్ కోసం సలహాలు ఇచ్చేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఎవరైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఒక ఫోటోను అప్లోడ్ చేసినప్పుడు ఫేస్‌బుక్‌ ఆటోమెటిక్గా వాటిని స్కాన్ చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్ ప్రొఫైల్స్ నుంచి కూడా ముఖాన్ని గుర్తించవచ్చు. ఫేస్ స్కానింగ్ ఫీచర్ను ఫేస్‌బుక్‌కు యాడ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook has to make sure that the facial scanning feature to unlock an account is reliable.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X