వాట్సాప్ మరోసారి డౌన్ అయ్యింది

వాట్సాప్ మరోసారి డౌన్ అయ్యింది. బుధవారం రాత్రి తలెత్తిన అంతరాయం కారణంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్ సేవలను కొన్ని నిమిషాల పాటు వినియోగించకోలేక పోయారు.

|

వాట్సాప్ మరోసారి డౌన్ అయ్యింది. బుధవారం రాత్రి తలెత్తిన అంతరాయం కారణంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్ సేవలను కొన్ని నిమిషాల పాటు వినియోగించకోలేక పోయారు. సర్వీస్ డౌన్ అవటానికి గల కారణాలను వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు.

ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్ తో 336రోజులు ఉచితంగా మాట్లాడుకోండిఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్ తో 336రోజులు ఉచితంగా మాట్లాడుకోండి

వాట్సాప్ సేవలను కొద్ది సేపటి వరకు

వాట్సాప్ సేవలను కొద్ది సేపటి వరకు

డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం చాలా వరకు దేశాల్లో వాట్సాప్ సేవలను కొద్ది సేపటి వరకు నిలిచిపోయాయి. వాట్సాప్ స్పందించకపోవటం పట్ల పలువురు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. వాట్సాప్ డౌన్ అవ్వటం కారాణంగా మెసెజ్ లను సెండ్ చేయలేకపోయామని, కొన్ని సందర్భాల్లో యాప్ కూడా లోడ్ అవ్వలేదని ట్విట్టర్ వేదికగా పలువురు వాపోయారు.

వాట్సాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్

వాట్సాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్

ఒకప్పుడు వాట్సాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఈ హోక్స్ మెసేజ్‌కు ఎంత దూరంగా ఉండే అంతమంచిది. ఇంకో ఆసక్తికర విషయమేటంటే వాట్సాప్ గోల్డ్ మెసేజ్ ఇప్పుడు రకరకాల రూపాల్లో షేర్ కాబడుతోంది. ఇందులో కొన్ని వేరియంట్స్ వేరే లింక్‌లోకి రీడైరెక్ట్ కాబడుతుంటే మరికొన్ని మాత్రం ఎర్రర్ మెసేజ్‌ను చూపిస్తున్నాయి.

ఈ మధ్య వాట్సాప్‌లో

ఈ మధ్య వాట్సాప్‌లో

ఈ మధ్య వాట్సాప్‌లో ఒక ఫేక్ మెసేజ్ హల్‌చల్ చేస్తోంది. వాట్సాప్‌ గోల్డ్ పేరుతో ఉంటోన్న ఈ మెసేజ్, దానిని అప్‌డేట్ చేసుకోమని చెబుతోంది. వాస్తవానికి ఇది అషీషియల్ అప్‌డేట్ కాదని, ఇది తెలియని పలువురు ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మాల్వేర్ వలలో చిక్కుకుంటున్నారని మెకాఫీ ఇండియా

 వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తున్నారు

వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తున్నారు

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ వెంకట్ క్రిష్ణాపుర్ వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తున్నారు.మన దేశంలో వాట్సాప్ సేవలను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 20 కోట్లకు పైగా ఉంది. ఈ ఫేక్ మెసేజ్ ఇప్పటికే చాలా మందికి రీచ్ అయి పోవటంతో ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని క్రిష్ణాపుర్ అంటున్నారు.

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్‌లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది. అందువల్ల మీకు అలంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి.

Best Mobiles in India

English summary
WhatsApp crashes briefly, millions affected.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X