ఆపిల్ గ్యాడ్జెట్లకు ‘ఇన్‌కేస్’!!

Posted By: Super

ఆపిల్  గ్యాడ్జెట్లకు ‘ఇన్‌కేస్’!!

 

హై క్వాలిటీ ఆడియో ఉత్పత్తులను అందించటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌కేస్(Incase)సంస్థ తాజాగా ఆపిల్ గ్యాడ్జెట్ల కొరకు ఆడ్వాన్సడ్ స్పెసిఫికేషన్లతో  ‘రిఫ్లెక్స్ హెడ్ ఫోన్ల’ను మార్కెట్లో  ప్రవేశపెట్టింది.

హై పెర్ఫామెన్స్ ఆడియో డ్రైవర్లను ఈ  డివైజులో పొందుపరిచారు. మ్యాక్ బుక్, ఐపోడ్, ఐఫోన్, ఐప్యాడ్ పరికరాలకు ఈ హెడ్ సెట్లను అనుసంధానం చేుసుకోవచ్చు. హెడ్ పోన్లలో ఏర్పాటు చేసిన రైట్ యాంగిల్డ్ ఆడియో జాక్ సూపిరియర్ ఆడియో కనెక్టువిటీకి దోహదపడుతుంది. ఆరెంజ్ రంగులో ఈ హెడ్ సెట్లు రూపుదిద్దుకున్నాయి.

రిఫ్లెక్స్ హెడ్ ఫోన్ల ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20 HZ నుంచి 20 kHz వరకు. అత్యాధునిక  మైక్రోఫోన్‌తో పాటు రెండు డ్రైవర్లను ఈ ఆడియో డివైజులో అనుసంధానించారు. పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ వ్యవస్థ  అంతరాయంలేని ఆడియోను శ్రోతకు అందజేస్తుంది. కాల్స్ రిసీవ్ చేసుకునే సమయంలో, మ్యూజిక్‌ను ఆస్వాదించే సందర్భంలో సంతృప్తికరంగా ఫీల్ అవుతాడు. ఇన్‌కేస్ రిఫ్లెక్స్ హెడ్‌ ఫోన్ల ఇండియన్ మార్కెట్ ధర రూ.4,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot