అద్భుతమైన ఆఫర్లతో BSNL బ్రాడ్‌బ్యాండ్ Rs.1,199 కాంబో ప్లాన్‌

|

బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయానికి వస్తే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) టెలికం ఆపరేటర్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో వున్న అన్ని పోటీలలో రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ బిఎస్‌ఎన్‌ఎల్ ఇండియాలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్నది.

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతానికి ఫైబర్ టు ది హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అభివృద్ధి చెందింది. ఇది ప్లాన్‌లను ఎంచుకోవడానికి చందాదారులకు అనేక ఎంపికలను కలిగి ఉంది. ఇందులో 10 Mbps నుండి 100 Mbps వేగంతో అందించే అన్ని రకాల ప్లాన్‌లు కూడా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల గురించి గమనించవలసిన మరో విషయం ఏమిటంటే దేశంలో రోజువారీ డేటా ప్రయోజనంతో ప్లాన్‌లను అందిస్తున్న టెలికామ్ ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే .

 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

సాధారణంగా చందాదారులు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను పొందినప్పుడు డేటాపై రోజువారీ పరిమితి లేకుండా వారు ఒకే డేటా పరిమితిని పొందుతారు. ఏదేమైనా ఎంపిక చేసిన బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల విషయంలో చందాదారులు మరుసటి రోజునే పునరుద్ధరించిన డేటా పరిమితిని పొందగలుగుతారు. రూ.1,199 బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా చందాదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాల్లో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లకు కూడా విస్తరిస్తాయి. వీటి గురించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Rs.1,750ల తగ్గింపు ధరతో Airtel Xstream BoxRs.1,750ల తగ్గింపు ధరతో Airtel Xstream Box

BSNL రూ.1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 10GB CUL ఫ్యామిలీ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లోని వినియోగదారులు రోజుకు 10GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు 10 Mbps వేగంతో డేటాను ఆస్వాదించవచ్చు. దీనితో పాటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు ఉచిత టెలిఫోన్ కనెక్షన్ కూడా లభిస్తుంది. ఈ టెలిఫోన్ కనెక్షన్ ద్వారా చందాదారులు దేశంలో ఎక్కడికైనా సరే 24/7 అపరిమిత కాల్స్ ను ఉచితంగా చేయగలరు. ఈ ప్లాన్‌లో FUP తరువాత డేటా యొక్క వేగం 40 Kbps కు తగ్గించబడుతుంది. అంటే చందాదారులు ఒక రోజులో 10GB డేటా అయిపోయిన తర్వాత థొరెటల్ వేగాన్ని అనుభవిస్తారు.

 

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలుమొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

10GB CUL ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు

10GB CUL ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు

ఇప్పుడు చందాదారుల కోసం ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అధిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 10GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో చందాదారులకు ఉచితంగా 3 సిమ్‌లు లభిస్తాయని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈ సిమ్‌ల ద్వారా చందాదారులు 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 1 జిబి డేటాను ఆస్వాదించగలుగుతారు. అంటే 3 సిమ్‌లలో చందాదారులు మొత్తంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇది మాత్రమే కాదు వారు కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇది రోజుకు 250 నిమిషాల క్యాప్ చేయబడి ఉంటుంది. ఈ సిమ్‌ల యొక్క ప్రయోజనం మరియు చెల్లుబాటు కాలం 28 రోజులుగా ఉంటుంది. 28 రోజులు ముగిసిన తర్వాత చందాదారులు తమ సొంత ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఈ సిమ్‌లను రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది .

BSNL బ్రాడ్‌బ్యాండ్ ఇతర ప్లాన్‌లు

BSNL బ్రాడ్‌బ్యాండ్ ఇతర ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు ప్రీపెయిడ్ సిమ్‌లతో బండిల్ చేయబడి అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లలో మరి కొన్ని ప్లాన్‌లు కూడా ఉన్నాయి. BSNL పోర్ట్‌ఫోలియోలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విషయానికి వస్తే ఇది వారి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఇలాంటి లేదా అంతకంటే ఎక్కువ వేగంతో రోజువారీ డేటా పరిమితి గల ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో రూ.899 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మొదటి వరుసలో ఉంటుంది. దీనిని 12GB CUL ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్లాన్ 10mbps వేగంతో రోజుకు 12GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో FUP తరువాత దీని వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌ ద్వారా చందాదారులు అపరిమిత కాలింగ్‌ను ఆనందిస్తారు.

బిఎస్ఎన్ఎల్ మరొక ప్లాన్

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరొక ప్లాన్ రూ.1,299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఇది రోజుకు 22 జిబి డేటాను చందాదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క డేటా వేగం 10mbps. ఈ ప్లాన్‌లో FUP తరువాత దీని వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌ కూడా చందాదారులకు అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Broadband Rs.1,199 Combo Plan Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X