అన్ని విప్పేందుకే... ఆ‘షో’?

Posted By: Staff

అన్ని విప్పేందుకే... ఆ‘షో’?

ప్రపంచ దేశాల టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రపంచపు ప్రముఖ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏ 2012 (IFA 2012) ఈ నెల31 నుంచి సెప్టంబర్ 5 వరకు బెర్లిన్

(జర్మనీ)లో జరగనుంది. ఈ ఆరు రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గ్యాడ్జెట్ ఇంకా గృహోపకరణాల తయారీ సంస్థలు తమ తమ నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించున్నాయి. ఈ అంతర్జాతీయ టెక్నాలజీ ప్రదర్శనకు సంబంధించి ఐఎఫ్ఏ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆయా రోజుల్లో జరిగే ఆవిష్కరణల వివరాలు...

బుధవారం, అగష్టు 29, 2012

సాయంత్రం 03.00 - 04.00 గంటల మధ్య: ప్రముఖ బ్రాండ్ పానాసానిక్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ డివైజ్ ఇలుగా, ఇలుగా పవర్ సామర్ధ్యం పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ముందుగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా పానాసానిక్ మిర్రర్‌లెస్ కెమెరాలతో పాటు ఏవీ(AV) ఆధారిత ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది.

సాయంత్రం 04.00 - 05.00 గంటల మధ్య: ప్రముఖ బ్రాండ్ సోనీ ఎక్స్‌పీరియా ఎస్ఎల్ (LT26ii), ఎక్స్‌పీరియా (LT29i), ఎక్స్‌పీరియా మింట్ (LT30i) వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది.

రాత్రి 07.00 - 08.00 గంటల మధ్య: ఈ కార్యక్రమంలో మెగాబ్రాండ్ సామ్‌సంగ్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ నోట్2 ఫాబ్లెట్‌ను ఆవిష్కరిస్తుంది.

గురువారం, అగష్టు 30, 2012:

ఉదయం 11.00 - 12.00 గంటల మధ్య: ఈ సమయంలో సామ్‌సంగ్ పలు గృహోపకరణాలను ప్రదర్శించనుంది.

మధ్యాహ్నం 01.00- 02.00 గంటల మధ్య: లెనోవో సరికొత్త టాబ్లెట్ పీసీలతో పాటు ఓ ఫాబ్లెట్‌ను ఆవిష్కరిస్తుంది. వాటి వివరాలు ఐడియా ట్యాబ్ ఏ2107 (7 అంగుళాలు), ఐడియా ట్యాబ్ ఏ2109 (9 అంగుళాలు), ఐడియా ట్యాబ్ ఏ2105 (ఫాబ్లెట్).

సాయంత్రం 03.00 - 05.00 మధ్య: యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ ఈ వేదిక పై 2012లో ఆవిష్కరించిన స్మార్ట్‌ఫో‌న్‌లతో పాటు మరిన్ని గృహోపకరణాలను ప్రదర్శించనుంది.

ఐఎఫ్ఏ 2012లో జరిగే కార్యక్రమాల వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot