బూతు బొమ్మల సైట్‌ల పై బ్యాన్!

Posted By: Prashanth

బూతు బొమ్మల సైట్‌ల పై బ్యాన్!

 

ఇండోనేషియా: ముస్లీంలకు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దేశంలో 10 లక్షల పైగా బూతు బొమ్మల వెబ్ సైట్ లను బ్యాన్ చేస్తూ ఇండోనేషియ సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు XBIZ న్యూస్ వైర్ మీడియా బుధవారం తెలిపింది. జూలై19 నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతున్న నేపధ్యంలో ప్రజల్లో నియమనిష్టలను మరింత పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూతబడిన వెబ్ సైట్ లన్ని ఇతర దేశాలకు చెందినవేనని సంస్ధ పేర్కొంది.

సాంకేతికతతో వెర్రీ వేషాలొద్దు!

సాంకేతిక పరిజ్ఞానం మరింత ఆధునీకతను సంతరించుకుంటున్న నేపధ్యంలో ఫీచర్ ఫోన్‌ల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌లు భర్తీ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌లు కేవలం కమ్యూనికేషన్ అవసరాలనే కాకుండా విద్య, వ్యాపార ఇతర వినోదాత్మక వనరులను సమకూరుస్తున్నాయి. ఇన్ని ప్రతిభలు కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను పలువురు నిర్థిష్ట పనులకు మాత్రమే వినియోగిస్తుంటే.. మరి కొందరు మాత్రం సాంకేతికతను అడ్డుపెట్టుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ పక్రియ ఆ క్షణంలో ఆనందాన్ని కలిగించినప్పటికి మితి మీరితే మాత్రం ఏరికోరి ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot