యూట్యూబ్‌లో ఆ వీడియో కలకలం!

By Super
|
 Nexus 4 Drop Test: Is the New Google Smartphone Sturdy Enough? [VIDEO]


ఎల్‌జి డిజైన్ చేసిన గూగుల్ బ్రాండెడ్ ఫోన్ ‘నెక్సస్ 4’ పై ఆసక్తికర వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ డ్రాప్‌టెస్ట్ వీడియోను జర్మన్ కామెంట్రీతో రూపొందించినప్పటికి క్యాప్చర్ చేసిన దృశ్యాలు స్పష్టమైన అవగాహనను కలిగిస్తాయి. ఈ కఠిన పరీక్షలో భాగంగా ‘నెక్సస్ 4’ను వివిధ ఎత్తుల నుంచి జారవిడిచారు. రెండు ధఫాలుగా సాగిన ఈ పీరీక్షలో తక్కువ ఎత్తు నుంచి నిర్వహించిన పరీక్షను నెక్సస్4 సమర్ధవంతంగా ఎదుర్కొగలిగింది. రెండవ కఠిన పరీక్షలో భాగంగా ఫోన్‌ను 6.6 అడుగల ఎత్తునుంచి జారవిడిచారు. ఈ క్రమంలో ఫోన్ డిస్‌ప్లే పాక్షికంగా దెబ్బతింది. ఈ మొత్తం వీడియోను నోకియా లూమియా 920 ద్వారా చిత్రీకరించటం మరో కొసమెరుపు. ఈ డ్రాప్ టెస్ట్ ద్వారా నెక్సస్ 4 స్మార్ట్‌ఫోన్ స్వల్పమైన ఆకస్మిక అవరోధాలను అధిగిమించగలదన్న విషయం స్పష్టమవుతోంది. డ్రాప్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో......

వీడియో యూఆర్ఎల్:

నెక్సస్ 4(nexus 4):

బరువు ఇంకా చుట్టుకొలత: 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు.

డిస్‌ప్లే: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్(జిరో గ్యాప్ టెక్నాలజీ)

ప్రాసెసర్: శక్తివంతమైన క్వాడ్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

మెమరీ : 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,

కెమెరా: 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ లి-పో బ్యాటరీ, టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై టైమ్ 390 గంటలు

ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ కు సంబంధించిన ప్రీబుకింగ్ లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (Saholic) ఆహ్వానిస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X