అసస్ బండారం ‘2012’లో బయటపడుతుంది..?

Posted By: Prashanth

అసస్ బండారం ‘2012’లో బయటపడుతుంది..?

 

వినూత్న ఆవిష్కరణలతో నిత్యం కంప్యూంటింగ్ మార్కెట్‌ను శాసించే ‘అసస్’ మరో సంచలనానికి కేంద్ర బింధువుగా నిలిచింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే 7 అంగుళాల స్ర్కీన్ సైజు గల టాబ్లెట్ కంప్యూటర్‌ను కొత్త తరహాలో అందించేందుకు వ్యూహరచన చేస్తోంది. 2012 ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ‘అసస్ ఇఇఇ ప్యాడ్ మెమో’(Asus EEE Pad MeMo) పనితీరు పై స్పెషల్ ఫోకస్:

7 అంగుళాల పరిమాణంలో స్టైలిష్ గా డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీతో సౌకర్యవంతంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. డివైజులో నిక్షిప్తం చేసిన ‘3 డైమెన్షనల్ డిస్ ప్లే’ వ్యవస్థ చూడచక్కని అనుభూతిని పంచుతుంది. ఏర్పాటు చేసిన టచ్ ఇంటర్ ఫేస్ వ్యవస్థ డివైజ్ ను సులువుగా ఆపరేట్ చేసేందుకు దోహదపడుతుంది.

మరో గమనించతగ్గ అంశం, ‘మిమైక్ బ్లూటూత్ కంపానియన్’ ఇది ఒక బ్లూటూత్ కంట్రోలర్ వ్యవస్థ. ఈ డివైజ్ ను టాబ్లెట్ తో విడిగా పొందవచ్చు. బ్లూటూత్ ఆధారితంగా టాబ్లెట్ పీసీకి ఈ డివైజ్ ను జతచేసుకోవల్సి ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీస్ లో ఉన్న సందర్భాల్లో టాబ్లెట్ తో నిమిత్తం లేకుండా మిమైక్ బ్లూటూత్ డివైజ్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు అదే విధంగా మ్యూజిక్ వినొచ్చు.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై టాబ్లెట్ రన్ అవుతుంది. శక్తివంతమైన న్విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot