మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో వచ్చేసింది..!

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో వచ్చేసింది..!

 

న్యూఢిల్లీ: దేశీయ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్, రూ.9999 ధరకు 10.1 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన టాబ్లెట్ పీసీ‘ఫన్ బుక్ ప్రో’ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో దీపక్ మెహరోత్ర మాట్లాడుతూ తాము మూడు నెలల క్రితం పరిచయం చేసిన 7 అంగుళాల టాబ్లెట్ ను అనతికాలంలోనే 1.4 లక్షల యూనిట్ ల వరకు విక్రయించగలిగామని, ఈ కొత్త ట్యాబ్ కూడా మంచి ఆదరణ పొందగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉన్న మరో రెండు టాబ్లెట్ పీసీలను ఈ నెలలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ సందర్భంగా దీపక్ పాత్రికేయులకు స్పష్టం చేశారు.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

8జీబి మెమరీ,

వై-ఫై,

0.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర రూ.7,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot