నోకియాకు, సామ్‌సంగ్ చెక్ పెడుతుందా..?

By Super
|
Samsung will be launching 3 Windows Phone


విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చెయ్యటంలో నోకియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజా పరిణామాల నేపధ్యంలో సామ్‌సంగ్ సైతం విండోస్ ఆధారిత ఫోన్‌లను ప్రమోట్ చేసేందుకు ఉత్సకన కనబరుస్తోంది. ఈ ఏడాదికి‌గాను మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ ప్రణాళిక రూపొందించింది. వీటిలో మొదటిది సామ్‌సంగ్ మండేల్ SGH-i667…

చైనాకు చెందిన ప్రముఖ ఫోరమ్ WPXAP, ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోను బహిర్గతం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో రూపుదిద్దుకుంటున్న ఈ హ్యాండ్‌సెట్ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ పుకార్లు వ్యక్తమవుతున్నాయి. డివైజ్ ఇంటర్నల్ హార్డ్‌వేర్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. లీకైన ఫోటో ఆధారంగా పలు ఫీచర్లను విశ్లేషకులు అంచనావేశారు. వాటి వివరాలు…

- 8జీబి ఇంటర్నల్ మెమెరీ,

- వైట్ గ్లోసీ బ్యాక్ ప్యానెల్,

- 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

- స్పీకర్ సపోర్ట్.

త్వరలోనే విడుదల కానున్న హెచ్‌టీసీ టైటాన్ II, నోకియా లూమియా 900 స్మార్ట్‌ ఫోన్‌లకు పోటీగా సామ్‌సంగ్ మండేల్ SGH-i667ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్‌లో విండోస్ ఫోన్ 7.5 రిఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టంను లోడ్‌చేసే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X