Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

|

వివో సంస్థ కూడా సరసమైన ధరల వద్ద 5G స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారుల జాబితాలో చేరింది. షియోమి, రియల్‌మి మరియు ఒప్పో సంస్థల తరువాత వివో ఇప్పుడు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసింది. వివో Z6 5Gగా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంది.

వివో Z6 5G

వివో Z6 5G

వివో Z6 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు వెనుకవైపు 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 765G ప్రస్తుతానికి చైనాకే పరిమితం అయినందున వివో Z6 5G ఇప్పుడే భారతీయ మార్కెట్‌లోకి రావడం మనం చూడకపోవచ్చు. భారత్‌కు 4G స్పెసిఫికేషన్‌లతో వస్తున్న ఒప్పో రెనో 3 ప్రో మాదిరిగానే వివో Z1 ప్రో మరియు వివో Z1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో భారీ విజయాన్ని సాధించింది.

 

 

ISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రోISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రో

ధరల వివరాలు

ధరల వివరాలు

వివో Z6 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర CNY2,198 (సుమారు రూ.22,000). మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర CNY 2598 (సుమారు రూ.26,000) గా ఉంది. ఇవి ఇంటర్‌స్టెల్లార్ సిల్వర్ మరియు ఐస్ ఏజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫిబ్రవరి 29 నుండి వీటిని ప్రీ-ఆర్డర్‌ల కోసం ఉంచుతుంది. అయితే భారత్‌తో సహా ఇతర మార్కెట్లలో వివో Z6 5G లభ్యత గురించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

 

 

Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ గల వివో Z6 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత FuntouchOS ద్వారా రన్ అవుతుంది. ఇది మెరుగైన వనరుల నిర్వహణ మరియు పనితీరు ఉత్పత్తి కోసం మల్టీ-టర్బో 3.0 మరియు గేమ్ స్పేస్ 3.0 వంటి సాఫ్ట్‌వేర్‌ మెరుగుదలలతో వస్తుంది. ఇది 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో 20: 9 కారక నిష్పత్తి మరియు 90.74 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.57-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 8GB ర్యామ్‌తో జత చేయబడి ఉంటుంది.

 

 

Apple ఆన్‌లైన్ స్టోర్ ఇండియాలో ప్రారంభానికి లైన్ క్లియర్...Apple ఆన్‌లైన్ స్టోర్ ఇండియాలో ప్రారంభానికి లైన్ క్లియర్...

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

వివో Z6 5G స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఎఫ్ / 1.79 ఎపర్చరు మరియు 6-ఎలిమెంట్ లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఎఫ్ / 2.2 ఎపర్చరు,112-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో వస్తుంది. మ్యాక్రో ఫోటోగ్రఫీ మరియు డెప్త్ సెన్సింగ్ కోసం ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో ఒక జత 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.48 ఎపర్చర్‌తో పంచ్‌-హోల్ నిర్మాణంతో వస్తుంది.

 

 

గొప్ప తగ్గింపు ధరలతో అమ్మకానికి రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లుగొప్ప తగ్గింపు ధరలతో అమ్మకానికి రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు

బ్యాటరీ

బ్యాటరీ

వివో Z6 5G స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండడమే కాకుండా ఇది 44W సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది బ్యాటరీని 0 నుండి 70 శాతం వరకు కేవలం 35 నిమిషాల్లో చేయగలుగుతుంది. ఇది 163.99 x 75.71 x 9.16mm పరిమాణంలో ఉండి 201 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-మోడ్ 5G (NSA + SA) మద్దతు, 4G LTE, బ్లూటూత్ 5.1, Beidu, గ్లోనాస్, GPS, గెలీలియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ మరియు ఫైల్ బదిలీ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. వివో Z6 5Gలో యాక్సిలెరోమీటర్, సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, దిక్సూచి మరియు గైరోస్కోప్ వంటి సెన్సార్‌లు కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Z6 5G With Quad Camera Setup, 5000mAh Battery and Snapdragon 765G Launched

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X