ఐటి సెజ్ భూముల విషయంలో ప్రభుత్వం అలసత్వం

Posted By: Super

ఐటి సెజ్ భూముల విషయంలో ప్రభుత్వం అలసత్వం

ఐటి కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐటి సెజ్‌ల పేరు మీద మంచి ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ నుండి భూములను తీసుకున్న ఐటి కంపెనీలు ఆ భూములలో ఎటువంటి పురోగతిని ప్రారంభించక పోవడంతో గవర్నమెంట్ మరలా తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్దమైంది. ఈ విషయంపై ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఇన్పోసిస్, బ్రహ్మాణి ఇన్ఫోటెక్, హిందు టెక్ జోన్ లాంటి కంపెనీలకు నోటీసులు పంపిన విషయం అందరికి తెలిసిందే.

ఆయా కంపెనీల నుండి ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ భూములు వెనుకకు తీసుకోవడం వల్ల మొత్తం హైదరాబాద్ ఐటి ఇండస్ట్రీకే పెద్ద నష్టం వాటిల్లుతుందని సాప్ట్ మేనర్‌లో గవర్నమెంట్ డీల్ చేస్తుంది. గవర్నమెంట్ ఆయా కంపెనీలకు నోటీసులు పంపినప్పటికీ వారి చేత కంపెనీలను స్దాపించడం కోసం రెండు సార్లు రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మీటింగ్స్‌లలో గవర్నమెంట్ నిర్ణయించుకుందేమిటంటే వారి వద్ద నుండి భూమిని తీసుకోవడం కంటే మరి కొంత కాలం కంపెనీలకు గడువుని ఇవ్వడం మంచిదని నిర్ణయించుకోవడం జిరిగింది.

దీనికి సంబంధించి ఐటి డిపార్ట్ మెంట్ ఆఫీసియల్ మాట్లాడుతూ మేము ఇచ్చిన భూములలో కంపెనీలు వాటి యొక్క సంస్దలను స్దాపించడానికి మరి కొంత కాలం గడువు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఒకసారి ఇచ్చిన భూమిని కంపెనీల నుండి తీసుకుంటే దాని ఎఫెక్టు మొత్తం ఐటి పరిశ్రమపై పడుతుందనే ఉద్దేశ్యంతో గడువు ఇవ్వడం జరిగిందన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot