Home
Scitech

ఇస్రో ఖాతాలో మరో మైలురాయి

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.దేశానికి చెందిన 380 కేజీల భూపరీశీలన ఉపగ్రహంతోపాటు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా పంపారు.కాగా ఈ ప్రయోగం నాలుగు దశల్లో పూర్తి అయ్యిందని ఇస్రో తెలిపింది.

రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది....

రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది....

ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ రాకెట్ నిర్దేశించిన సమయానికి విజయవంతంగా మూడు దశలను దాటుకుంటూ కక్ష్యలోకి ప్రయాణించింది. పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు.

2 గంటల తర్వాత పీఎస్ఎల్వీ సీ43....

2 గంటల తర్వాత పీఎస్ఎల్వీ సీ43....

దాదాపు 2 గంటల తర్వాత పీఎస్ఎల్వీ సీ43 స్వదేశీ హైపరసానిక్ ఉపగ్రహాన్ని సూర్య సమస్థితి కక్ష్యలోని 630 కిలోమీటర్ల ఎత్తున, మిగతా 30 విదేశీ ఉపగ్రహాలను 540 కిలోమీటర్ల ఎత్తున రెండు దశల్లో నిలుపుతుంది. వాస్తవానికి హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో తొలిసారిగా 2008 మేలో ప్రయోగించింది. సుమారు 83 కిలోల బరువైన ఈ ఉపగ్రహా ప్రయోగాన్ని చంద్రయాన్-1 తర్వాత నిర్వహించింది.

అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు....

అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు....

ఈ రాకెట్‌లో అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. విదేశీ ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోల బరువు కాగా, వీటిలో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని పీఎస్ఎల్వీసీ 43 రాకెట్ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు రాకెట్‌లోని నాలుగో దశ ఇంజిన్‌ను రెండుసార్లు మండించారు. స్వదేశీ ఉపగ్రహం హైచ్‌వైఎస్ఐఎస్ బరువు 380 కిలోలు.

ఈ శాటిలైట్ సాయంతో...

ఈ శాటిలైట్ సాయంతో...

భూమి నుంచి 630 కిలోమీటర్ల ఎత్తున ఉండే ఈ శాటిలైట్ సాయంతో అడవులు, వ్యవసాయం, తీర ప్రాంతాల అంచనా, భూగర్భ జలాలు, ఇతర భూగర్భ పర్యావరణం లాంటి అంశాలపై నిఘా పెడతారు. దాంతో పాటు హైసిస్‌ను మిలటరీ నిఘా కోసం ఉపయోగిస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రధాన విభాగం అహ్మదాబాద్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డిజైన్ చేయగా, చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ల్యాబ్‌లో తయారుచేశారు.

More from GizBot

Best Mobiles in India

English summary
ISRO launches HysIS satellite, 30 others with PSLV-C43 rocket today: Everything to know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X